సింగరేణి రామగుండం బొగ్గు గనిలో ఇద్దరు కార్మికులకు కరెంట్ షాక్

 సింగరేణి రామగుండం బొగ్గు గనిలో  ఇద్దరు కార్మికులకు కరెంట్ షాక్

గోదావరిఖని, వెలుగు: సింగరేణి రామగుండం జీడీకే 11వ గనిలో ఇద్దరు కార్మికులకు కరెంట్​ షాక్​ కొట్టింది. శనివారం తెల్లవారుజామున గనిలోని 3వ సీమ్​ సౌత్​ డిస్ట్రిక్ట్​లోని 12డీ/54ఎల్ఎస్​ ప్రాంతంలో ఆకుల సురేశ్‌‌‌‌‌‌‌‌, వి.అశ్వంత్​ కుమార్​ కోల్​కట్టర్ ​డ్రిల్లింగ్​ పనులు చేస్తున్నారు. ఎల్‌‌‌‌‌‌‌‌హెచ్​డీ వెహికల్​ డ్రిల్లింగ్​ మిషన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన కేబుల్‌‌‌‌‌‌‌‌ను లాగడంతో షార్ట్​ సర్క్యూట్‌‌‌‌‌‌‌‌కు గురై ఈ ఇద్దరు కార్మికులకు షాక్​కు కొట్టింది.  

తీవ్రంగా గాయపడిన వారిని.. ఇతర కార్మికులు సింగరేణి ఏరియా హాస్పిటల్​కు తరలించి ట్రీట్​మెంట్​ అందించారు. కాగా ఈ ప్రమాదం మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ నిర్లక్ష్యం వల్లే జరిగిందని హెచ్ఎంఎస్​ జనరల్​ సెక్రటరీ రియాజ్​ అహ్మద్​, ఏరియా వైస్​ ప్రెసిడెంట్​ ఆరెల్లి పోచం, సీఐటీయూ జనరల్​ సెక్రటరీ​ టి.రాజారెడ్డి, ఆరెల్లి రాజమౌళి ఆరోపించారు.