మెడికవర్ లో అరుదైన చికిత్స.. బబుల్-హెడ్ డాల్ సిండ్రోమ్తో బాధపడుతున్న రెండేళ్ల చిన్నారి

మెడికవర్ లో అరుదైన చికిత్స..  బబుల్-హెడ్ డాల్ సిండ్రోమ్తో బాధపడుతున్న రెండేళ్ల చిన్నారి

పద్మారావునగర్​,వెలుగు: అరుదైన బబుల్-హెడ్ డాల్ సిండ్రోమ్​తో బాధపడుతున్న రెండేళ్ల చిన్నారికి సికింద్రాబాద్​  మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్లు న్యూరో-ఎండోస్కోపిక్ సర్జరీ చేసి పునర్జన్మ ఇచ్చారు.  మంగళవారం డాక్టర్లు మీడియాకు వివరాలు వెల్లడించారు. 

సిటీలోని ఎల్​బీ నగర్​ కు చెందిన దంపతులు తమ రెండేళ్ల కొడుకు తరచూ తన తలను నో--నో లాగా నిరంతరం అడ్డంగా ఊపడం గమనించారు. సికింద్రాబాద్​ మెడికవర్ దవాఖానకు తీసుకురాగా, డాక్టర్లు అరుదైన వ్యాధి బబుల్-హెడ్ డాల్ సిండ్రోమ్​గా నిర్ధారించారు.

కాంప్లెక్స్(మల్టిలోక్యులేటెడ్) హైడ్రో సెఫలస్​గా గుర్తించిన ఈ కేసులో మెదడులోని అనేక విడిపోయిన ద్రవ గదులను న్యూరో-నావిగేషన్ సాయంతో ఎండోస్కోపిక్ ద్వారా, ప్రోగ్రామబుల్ వీపీ  స్టంట్​ అమర్చారు. సర్జరీ అనంతరం బాబు ఆరోగ్యం మెరుగుపడింది. సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్​ రమేశ్​ శిఘకొల్లి, చీఫ్ అనస్థీటిస్ట్ డాక్టర్​ భవాని శంకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.