
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువతులు మృతి చెందారు. వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లాకు చెందిన అశ్విని, మంజుల అనే ఇద్దరూ అక్కాచెల్లెలు శుక్రవారం (మే 2) హైదరాబాద్లో ఎంసెట్ పరీక్ష రాసి తిరిగి కారులో ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో జక్రాన్పల్లి మండలం తొర్లికొండ ఎక్స్ రోడ్ వద్ద వీరు ప్రయాణిస్తోన్న కారు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అశ్విని, మంజుల ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.
గమనించిన స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షకు వెళ్లిన బిడ్డలు విగతజీవులుగా మారడంతో మృతుల తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
►ALSO READ | లిఫ్ట్ ఇచ్చి, చోరీ చేసి.. 9 నెలలకు దొరికిన్రు..పుస్తెలతాడు అపహరణ కేసులో నలుగురు అరెస్ట్