మూడున్నర గంటల్లోనే న్యూయార్క్‌‌ టు లండన్‌‌

మూడున్నర గంటల్లోనే న్యూయార్క్‌‌ టు లండన్‌‌

సూపర్​ స్పీడ్‌‌ విమానాలను కొననున్న యూఏఈ
న్యూయార్క్‌‌: న్యూయార్క్​ నుంచి విమానంలో లండన్ చేరుకోవడానికి ఇప్పుడు 7 గంటలు పడుతోంది.. ఇందులో సగం టైమ్​లోనే గమ్యం చేరుకుంటే ఎలా ఉంటుంది? అది కూడా విమానంలోనే.. అలాంటి విమానాలను అమెరికాకు చెందిన ఎయిర్‌‌లైన్స్‌‌ స్టార్టప్‌‌  ‘బూమ్‌‌ సూపర్‌‌ సోనిక్‌‌’ డెవలప్‌‌ చేస్తోంది. ఆ హైస్పీడ్‌‌ విమానాలను కొనేందుకు యునైటెడ్‌‌ అరబ్‌‌ ఎమిరేట్స్‌‌ ప్లాన్‌‌ చేస్తోంది. తొలుత 15 విమానాలను కొనాలనుకుంటోంది. ఒక్కోటీ ఎంత రేటుంటుందో కంపెనీ చెప్పలే. ఇప్పుడున్న విమానాలకు డబుల్‌‌ స్పీడ్‌‌తో వెళ్లే ఈ సరికొత్త విమానాల్లో కమర్షియల్‌‌ సర్వీసులను 2029 నాటికి ప్రారంభించాలని కంపెనీ ప్రయత్నిస్తోంది. రెన్యువబుల్‌‌ ఎనర్జీతో నడవడం ఈ విమానాల మరో ప్రత్యేకత.