సనాతన ధర్మం అనేది ఓ రోగం.. ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

సనాతన ధర్మం అనేది ఓ రోగం.. ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

తమిళనాడు సీఎం  కుమారుడు, మంత్రి  ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని, దానిని  పూర్తిగా నిర్మూలించాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.  సనాతన ధర్మం అనేది మలేరియా, డెంగ్యూ లాంటిది, కాబట్టి దీనిని నిర్మూలించాలి, వ్యతిరేకించకూడదు అంటూ మాట్లాడారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రిపై కేసు పెట్టాలని పలువురు పిలుపునిస్తు్న్నారు.  

మంత్రి ఉదయనిధి చేసిన కామెంట్స్ పై  తమిళ నాడు బీజేపీ మండిపడింది. సనాతన ధర్మాన్ని ఉదయనిధి మలేరియా, డెంగ్యూలతో పోల్చుతున్నారన్నారు. దీనిని వ్యతిరేకించడం కాకుండా సమూలంగా నిర్మూలించాలని అభిప్రాయపడుతున్నారన్నారు. క్లుప్తంగా చెప్పాలంటే సనాతన ధర్మాన్ని పాటించేవారు జనాభాలో 80 శాతం మంది ఉన్నారని, వారిని సామూహికంగా హత్య చేయాలని ఆయన అభిప్రాయపడుతున్నారన్నారు.

అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఉదయనిధి క్లారిటీ ఇచ్చారు.  సనాతన ధర్మాన్ని పాటించే వాళ్లని తాను ఏమీ అనలేదని అన్నారు. మతాలు, కులాల పేరిట సనాతన ధర్మం అనేది సమాజాన్ని విభజిస్తోందని,  మనుషుల్ని, సమానత్వాన్ని ఈ సనాతన ధర్మం విడగొట్టేస్తోందని అభిప్రాయపడ్డారు. 

తాను మాట్లాడిన ప్రతీ మాటకు కట్టుబడి ఉంటానన్న ఆయన .. సనాతన ధర్మం వల్ల బాధపడుతున్న బలహీన వర్గాలు, బడుగు వర్గాల ప్రజల తరుపున మాట్లాడానన్నారు.  కోవిడ్, డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు ఈ సమాజానికి ఎలా హానికరమో.. ఈ సనాతన ధర్మం కూడా హానికరమే అంటూ ట్వీట్ చేశాడు.  దీనిపై తనకు ఎవరు ఎలాంటి నోటీసులు పంపినా, సవాళ్లు విసిరినా నేను రెడీ అంటూ ట్వీట్ చేశారు.