సనాతన ధర్మంపై స్పందించండి.. మరీ లోతుల్లోకి వద్దు..: మంత్రులతో ప్రధాని మోదీ

సనాతన ధర్మంపై స్పందించండి.. మరీ లోతుల్లోకి వద్దు..: మంత్రులతో ప్రధాని మోదీ

సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాస్పద వ్యాఖ్యలపై సరియైన రీతిలో సమాధానం చెప్పాలని ప్రధాని మోదీ బుధవారం కేంద్ర మంత్రులకు సూచించారు. చరిత్రలోకి వెళ్లొద్దు.. రాజ్యాంగం ప్రకారం వాస్తవాలకు కట్టుబడి ఉండండి.. ఈ సమస్యపై ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడండి అని.. జీ20 సమావేశాలకు ముందు మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు సూచించారు. 

గత శనివారం ( 2023 సెప్టెంబర్ 2న)  తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాధన ధర్మం.. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చడం దుమారం రేపింది. ఇలాంటి వాటిని వ్యతిరేకంచడమే కాదు.. నాశనం చేయాలి అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు.. 

ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై మూడు రోజులుగా కామెంట్లు, కౌంటర్లతో పెద్దఎత్తున నిరసన వెల్లువెత్తాయి.  స్టాలిన్ వ్యాఖ్యలపై వివిధ రాజకీయ పార్టీలు విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా బీజేపీ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎందుకు ఖండించడం లేదని బీజేపీ ఆరోపించింది. యూపీ సన్యాసి పరమహంస ఆచార్య ఉదయ నిధి తల నరికిన వారికి రూ. 10 కోట్ల బహుమతి ప్రకటించడం.. దానికి ఉదయనిధి కౌంటర్ తో దేశవ్యాప్తంగా సనాతన ధర్మంపై చర్చనీయాంశమైంది.