యూనివర్సిటీలు, కాలేజీల్లో తరగతులు ప్రారంభించండి

యూనివర్సిటీలు, కాలేజీల్లో తరగతులు ప్రారంభించండి

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నవేళ..కేంద్ర వైద్యారోగ్య సూచనలతో రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ సంస్థలు కరోనా ఆంక్షలు సడలిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ, ఢిల్లీ, సిక్కిం, మహారాష్ట్రలో కరోనా ఆంక్షలు ఎత్తివేశాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. ఈక్రమంలో దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, కాలేజీలు ఆఫ్ లైన్ క్లాసులు ప్రారంభించాలని యూనివర్సిటీస్ గ్రాంట్ కమిషన్ (UGC) ప్రకటించింది. ఈమేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని యూనివర్సిటీలకు  నోటీసు జారీచేసింది UGC.

దేశ వ్యాప్తంగా ఉన్న UGC అనుబంధ వర్సిటీలు, కాలేజీల్లో ప్రత్యక్ష తరగతులతో పాటు, స్థానిక పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలతో ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలని తెలపింది. విద్యార్థులందరూ తరగతులకు హాజరయ్యేల చూడాలని, ప్రత్యక్ష తరగతులకు హాజరు కాలేని విద్యార్థుల కోసం ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలని UGC సూచించింది. ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులకనుగుణంగా..పరీక్షలు కూడా ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో నిర్వహించాలని సూచించింది.  దీనికి సంబంధించి  పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. అన్ని యూనివర్శిటీలు, కాలేజీలతో పాటు ఇతర ఉన్నత విద్యా సంస్థలలో కొవిడ్  నియమాలు ఖచ్చితంగా పాటించేలా చూడలంది.

మరిన్ని వార్తల కోసం..

బజాజ్ కంపెనీ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ మృతి