బజాజ్ కంపెనీ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ మృతి

బజాజ్ కంపెనీ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ మృతి

ప్రముఖ పారిశ్రామిక వేత్త, బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత రాహుల్ బజాజ్ (83) శనివారం  కన్నుమూశారు. కొన్నాళ్లుగా నిమోనియాతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని బజాజ్ గ్రూప్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. నిమోనియాతో పాటు హృద్రోగ సమస్యలు ఉన్న రాహుల్ బజాజ్ గత నెలలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని పుణేలోని రూబీ హాల్ క్లినిక్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ పర్వేజ్ గ్రాంట్ తెలిపారు.

రాహుల్ బజాజ్.. 1938 జూన్ 10న జన్మించారు. దాదాపు 40 ఏండ్ల పాటు బజాజ్ గ్రూప్ చైర్మన్ గా వ్యవహరించిన ఆయన.. బజాజ్ కంపెనీ ప్రతి ఇండియన్ సొంతం చేసుకునేలా ‘హమారా బజాజ్’తో టూవీలర్ ను తీర్చిదిద్దారు. ఆయన తాత జమ్నాలాల్ బజాజ్ స్థాపించిన ఈ కంపెనీని దేశంలో టాప్ వెహికల్ కంపెనీగా నిలిపడంలో రాహుల్ బజాజ్ పాత్ర ఎంతో కీలకం. 

గత ఏడాది ఏప్రిల్ లో ఆయన బజాజ్ కంపెనీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం గౌరవ చైర్మన్ హోదాలో ఉన్న ఆయనకు 2001 సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డును ప్రధానం చేసింది. ఆయన గతంలో రాజ్యసభ ఎంపీగా కూడా పని చేశారు. ఇండియన్ మోటార్ వెహికల్ రంగంలో ప్రత్యేకమైన ముద్ర వేసిన హమారా బజాజ్ పై రూపొందించిన యాడ్ లో కార్పొరేట్ రంగంలో నిలిచిపోయే ట్యాగ్ లైన్ ను రూపొందించారు. ‘‘యువ్ జస్ట్ కాంట్ బీట్ ఏ బజాజ్ అండ్ హమారా బజాజ్’’ అన్న ట్యాగ్ లైన్ తో యాడ్ చేశారు. కాగా, రాహుల్ మృతి పట్ల కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే పలువురు కాంగ్రెస్ నేతలు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు సంతాపం తెలిపారు.

  • - 1938 జూన్ 10న కోల్ కతాలో జననం.
  • - రాహుల్ బజాజ్ తాత జమ్నాలాల్ బజాగ్ 1962లో బజాజ్ గ్రూప్ సంస్థను ప్రారంభించారు. 1942లో జమ్నాలాల్ మరణం తర్వాత ఆయన పెద్ద కుమారుడు కమల్ నయన్ బజాజ్ (రాహుల్ తండ్రి).. ఆ కంపెనీ బాధ్యతలు చేపట్టారు. 1965లో రాహుల్ బజాబ్ తన తండ్రి నుంచి చైర్మన్ బాధ్యతలు తీసుకున్నారు.
  • - ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు రాహుల్ బజాజ్. అనంతరం బాంబే యూనివర్సిటీ నుంచి 1958లో లా పట్టా అందుకున్నారు. అనంతరం అమెరికాలోని హార్వార్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. 1965లో ఆయన బజాజ్ గ్రూప్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు.
  • - పరిశ్రమ,  వాణిజ్య రంగంలో రాహుల్ బజాజ్ సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 2001లో ఆయనకు పద్మ భూషణ్ పురస్కారాన్ని అందజేసింది.
  • - ఫ్రాన్స్ అత్యున్నత పౌర పుస్కారం ‘‘Knight of the National Order of the Legion of Honour’’ను ఆ దేశం అందజేసింది.
  • - 2006లో రాజ్యసభ ఎంపీగా ఎంపికయ్యారు.
  • - 2017లో సీఐఐ ప్రెసిటెండ్స్ అవార్డ్ ఫర్ లైఫ్ టైమ్ అచ్చీవ్ మెంట్ పురస్కారాన్ని అందుకున్నారు.