ప్రతి ప్రేమకు ఓ చీకటి కోణం: ఆసక్తికరంగా అగ్లీ స్టోరీ మూవీ ట్రైలర్

ప్రతి ప్రేమకు ఓ చీకటి కోణం: ఆసక్తికరంగా అగ్లీ స్టోరీ మూవీ ట్రైలర్

నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో ప్రణవ స్వరూప్ తెరకెక్కించిన చిత్రం ‘అగ్లీ స్టోరీ’. సుభాషిని, కొండా లక్ష్మణ్‌‌ నిర్మించారు. మే 22న సినిమా విడుదల కానుంది. బుధవారం ట్రైలర్‌‌‌‌ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.  దర్శకుడు సాగర్‌‌‌‌ కే చంద్ర ముఖ్య​అతిథిగా హాజరై ట్రైలర్‌‌‌‌ను విడుదల చేసి మేకర్స్‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.  హీరో నందు మాట్లాడుతూ ‘ఇందులోని పాత్ర నాకు కొత్త ఛాలెంజ్. ఇదొక ఆసక్తికరమైన రొమాంటిక్ థ్రిల్లర్.

అవికా మంచి ఎమోషనల్ డెప్త్ ఇచ్చింది. ప్రణవ చాలా బాగా తీశారు. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది’ అని చెప్పాడు. ఇలాంటి ఓ అద్భుత చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని అవికా గోర్‌‌‌‌ చెప్పింది.  దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రతి ప్రేమకు ఓ చీకటి కోణం ఉంటుంది. ఆ నిజాన్ని బలంగా చెప్పడమే ఈ సినిమా లక్ష్యం. నందు, అవికల నటన ఈ సినిమాకు ప్రధానబలం. 

ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది’ అని చెప్పాడు.  నందు, అవిక నటనతో పాటు దర్శకుడి టేకింగ్‌‌కు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని నిర్మాతలు సుభాషిణి, లక్ష్మణ్ తెలియజేశారు. అతిథిగా హాజరైన నిర్మాత బెక్కం వేణు గోపాల్ మూవీ టీమ్‌‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.