గూగుల్ మ్యాప్స్ లో ఆధార్ కేంద్రాలు

గూగుల్ మ్యాప్స్ లో ఆధార్ కేంద్రాలు

న్యూఢిల్లీ: యూఐడీఏఐ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆధార్ కేంద్రాలను గూగుల్ మ్యాప్స్‌‌లో చూపించేందుకు గూగుల్ సంస్థతో జతకట్టింది. దీనివల్ల ప్రజలు తమకు దగ్గరలో ఉన్న ఆధార్ కేంద్రాలను సులభంగా గుర్తించి సేవలు పొందవచ్చు. 

కొన్ని నెలల్లో అందుబాటులోకి రాబోయే ఈ కొత్త సదుపాయం ద్వారా కేంద్రం వివరాలు అక్కడ లభించే సేవలు, సదుపాయాల సమాచారం తెలుస్తుంది.  గూగుల్​ ద్వారానే అపాయింట్​మెంట్లు కూడా బుక్​ చేసుకోవచ్చు.