
బ్రిటన్ మంత్రివర్గంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హోంమంత్రి సుయెల్లా బ్రేవర్ మాన్ ను తొలగించిన ప్రధాని రిషీ సునక్ ..ఆమె స్థానంలో విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవెర్లీని నియమించారు. దీంతో ఖాళీ అయిన విదేశాంగ మంత్రి పదవిని మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ తో భర్తీ చేశారు. ప్రస్తుతం కామెరూన్ యూకే పార్లమెంట్ కు ఎన్నిక కాలేదు. బ్రిటన్ ఎగువ సభ హౌస్ ఆఫ్ లార్డ్స్ లో కామెరూన్ కు సీటు ఇవ్వడానికి కింగ్ చార్లెస్ ఆమోదం తెలిపారు.
పాలస్తీనా అనుకూలవాదులపై లండన్ పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ చేసిన వ్యాఖ్యలు సుయెల్లా మంత్రి పదవికి ఎసరుపెట్టాయి. కేబినెట్ నుంచి మరికొంత మందిని తొలగించాలని సునాక్ భావిస్తున్నారని ఊహాగానాలు వెలువడుతున్నాయి.
బ్రెగ్జిట్ రెఫరెండంలో ఓడిపోవడంతో డేవిడ్ కామెరూన్ 2016లో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అదే ఏడాది ఎంపీగా బరిలోకి దిగారు. 2021లో ఫైనాన్స్ గ్రూప్ గ్రీన్‌సిల్ క్యాపిటల్ కోసం UK ప్రభుత్వాన్ని లాబీయింగ్ చేసిన తర్వాత కుంభకోణంలో చిక్కుకున్నారు. ఆ తర్వాత అది కుప్పకూలింది. ఈ ఎపిసోడ్ అతని ప్రతిష్టను ఘోరంగా దెబ్బతీసేలా చేసింది.
ALSO READ :- మరో స్టార్ బిలియనీర్ విడాకులు.. 32 ఏళ్ల బంధానికి వీడ్కోలు