
మెదక్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఓ వ్యక్తి మృతి చెందగా.. అతడి మరణం తట్టుకోలేక మృతుడి కోడలు గుండెపోటుతో చనిపోయింది. మామ, కోడళ్ల మృతితో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. స్థానికుల వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేటకు చెందిన పోచయ్యకు ఇటీవల ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పోచయ్య చికిత్స పొందుతూ శనివారం (మార్చి 8) మృతి చెందాడు.
ALSO READ | డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు.. ఎస్సారెస్పీ కాల్వలోకి దూసుకెళ్లిన కారు
పోచయ్య మృతిని అతడి కోడలు సుమలత తట్టుకోలేకపోయింది. మామ మరణించాడన్న బాధలో తీవ్ర ఒత్తిడికి గురి కావడంతో హార్ట్ ఎటాక్ వచ్చి సుమలత కూడా చనిపోయింది. గంటల వ్యవధిలోనే మామ, కోడళ్లు మృతి చెండటంతో పోచయ్య కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందటంతో మక్కరాజుపేట గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.