సంతానం కలగలేదనే.. పాప కిడ్నాప్

సంతానం కలగలేదనే.. పాప కిడ్నాప్

నిందితురాలిని వికారాబాద్​లో అదుపులోకి తీసుకున్న పోలీసులు

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ కల్లు కాంపౌండ్ నుంచి కిడ్నాప్​అయిన ఆరేండ్ల కీర్తన ఎట్టకేలకు దొరికింది. ఈ కేసులో నిందితురాలిని ఎయిర్ పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంతానం కలగకపోవడంతోనే ఆమె పాపను తీసుకెళ్లిందని తెలిపారు.  రంగపురం రజిని అనే మహిళ రాళ్లగూడలో కూలీ పనులు చేస్తుంటుంది. ఆమెకు సంతానం కలగలేదు.

 కల్లు తాగే అలవాటున్న రజిని ఈ నెల 1న శంషాబాద్​కల్లు కాంపౌండ్​కు వెళ్లింది. అక్కడ ఆడుకుంటున్న కీర్తనను కిడ్నాప్ చేసి, తన వెంట వికారాబాద్ తీసుకెళ్లింది. పాప తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఎయిర్ పోర్ట్ పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి, వెతకడం ప్రారంభించారు. చివరకు వికారాబాద్​లో పాప ఉన్నట్లు తెలుసుకొని, అక్కడికి వెళ్లారు. రజినిని అదుపులోకి తీసుకొని, కీర్తనను ఆమె తండ్రికి అప్పగించినట్లు ఎస్సై అర్షద్​అలీ పేర్కొన్నారు.