‘హను-మాన్’ లో అండర్ వాటర్ సీన్స్‌‌

 ‘హను-మాన్’ లో అండర్ వాటర్ సీన్స్‌‌

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న సూపర్ హీరో మూవీ ‘హను–మాన్’. అమృత అయ్యర్ హీరోయిన్‌‌. కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ‘హను–-మాన్’ టీమ్ ముంబైలో కీలకమైన అండర్ వాటర్ సీక్వెన్స్‌‌ని పిక్చరైజ్ చేస్తోంది.  ప్రశాంత్ వర్మ దీన్ని గ్రాండ్ కాన్వాస్‌‌పై రూపొందిస్తున్నారు. ఈ కష్టమైన సీక్వెన్స్ కోసం తేజకు హైదరాబాద్‌‌లో పదిహేను రోజుల పాటు స్పెషల్ ట్రైనర్ దగ్గర కోచింగ్ ఇప్పించాడట ప్రశాంత్ వర్మ. 

దీంతో తేజ  హార్డ్ వర్క్ చేసి బ్రిలియంట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెబుతున్నారు.  ఇది చాలా రిస్కీ సీక్వెన్స్. దీని కోసం  తేజ ఊపిరి తీసుకోకుండా నీటిలో ఉండాల్సి ఉంటుంది. అయితే తేజ దానిని పట్టుదలతో ప్రాక్టీస్ చేసి చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసి, టీమ్‌‌ని ఆశ్చర్యపరిచాడని చెప్పారు మేకర్స్. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’, రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాలోనూ.. ఇలాంటి అండర్ వాటర్ సీన్స్‌‌ని తెరకెక్కించారు.