మార్చి 25న  ఇందిరా పార్క్ వద్ద 'నిరుద్యోగ మహాధర్నా'

 మార్చి 25న  ఇందిరా పార్క్ వద్ద 'నిరుద్యోగ మహాధర్నా'

'మా నౌఖరీ మాగ్గావాలె' అనే నినాదంతో మార్చి 25న  హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగ మహాధర్నా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరుద్యోగులతో ఈ దీక్షను నిర్వహించనుంది.

TSPSC పేపర్ లీకేజీలో కీలక పాత్ర ఉన్నందున  మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేయాలని, కేసును సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, పరీక్షల రద్దుతో నష్టపోయిన విద్యార్థులకు రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలన్న డిమాండ్లతో ఈ మహాధర్నా జరగనుంది.  

TSPSC పేపర్ లీకేజీతో పాటుగా ఇతర అంశాలపై బండి సంజయ్ అధ్యక్షతన మార్చి 23న పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మాజీ ఎంపీలు వివేక్‌, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రవీంద్రనాయక్‌, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.