కారు ధ్వంసం చేసి.. సారీ లెటర్,100 డాలర్లు పెట్టి వెళ్లిండు

 కారు ధ్వంసం చేసి.. సారీ లెటర్,100 డాలర్లు పెట్టి వెళ్లిండు

అమెరికాలో ఘటన.. 
సోషల్​ మీడియాలో పోస్ట్ వైరల్​

వాషింగ్టన్​: మనకు తెలవనోళ్ల కారు డ్యామేజ్ చేస్తే, ముందు.. వెనుక చూసి ఎవరూ లేకపోతే అక్కడి నుంచి జారుకుంటాం. కానీ ఓ వ్యక్తి మాత్రం.. తన వల్ల కారు ఓనర్​ లాస్​ కావొద్దని భావించి.. ‘సారీ’ లెటర్​తో పాటు 100 డాలర్లు పెట్టి మరీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీన్ని చూసిన ఓనర్​కు కోపం వచ్చింది. పోలీసులకు కంప్లైంట్​ చేయగా, వారు ఇన్వెస్టిగేట్​ చేస్తున్నారు. ఈ ఘటన అమెరికా.. ఫ్లోరిడాలోని డిస్నీ వరల్డ్​ వద్ద జరిగింది.

‘‘బే లేక్.. వాల్ట్​ డిస్నీ వరల్డ్ రిసార్ట్​లోని ఎప్​కాట్​ థీమ్​ పార్క్​కు ఒకతను కారు తీసుకొని వచ్చాడు. అక్కడ హాన్సన్​ షో చూసి ఎంజాయ్​ చేశాడు. తిరిగి వచ్చి చూస్తే అతని కారు డ్యామేజ్ అయి ఉంది. ఎవరు చేశారో తెలీదు. డ్యామేజ్​ చేసినందుకు ఓ సారీ లెటర్, 100 డాలర్లు పెట్టి వెళ్లాడు. లెటర్​లో పేరు మాత్రం లేదు”అని డిస్నీ థీమ్​పార్క్స్​ తన సోషల్​ మీడియాలో పోస్టు చేసింది. ఈ పోస్టు చాలా వైరల్​ అయ్యింది.

ఒక్కో నెటిజన్​ ఒక్కోలా స్పందిస్తున్నారు. కొందరు కారు ఓనర్​పై జాలి చూపిస్తుంటే.. మరికొందరు డ్యామేజ్​ చేసిన వ్యక్తిని తప్పుబడుతున్నారు. ‘‘మీరు వెంటనే సెక్యురిటీ కెమెరాలు చెక్​ చేసి.. పోలీసులకు కంప్లైంట్​ చేయండి” అని ఓ నెటిజన్​ అంటే.. అది కూడా చేశామని, పోలీసులు ఇన్వెస్టిగేషన్​ చేస్తున్నారని ఓనర్ రిప్లై ఇచ్చాడు. ‘‘అవతలి వ్యక్తి తాగి డ్రైవ్​ చేయడంతోనే మీ కారు డ్యామేజీ అయింది” అని ఒకరంటే.. ఓవర్​ స్పీడ్​ కారణమని మరో యూజర్​ కామెంట్​ చేశాడు.