ప్రభుత్వ ఖర్చుల కోసం.. 11.6 లక్షల కోట్ల అప్పు

ప్రభుత్వ ఖర్చుల కోసం.. 11.6 లక్షల కోట్ల అప్పు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2022–23 ఫైనాన్షియల్ ఇయర్ లో ప్రభుత్వ ఎక్స్ పెండిచర్ కోసం మార్కెట్ నుంచి రూ. 11,58,719 కోట్ల అప్పు చేయనుంది. నిరుడు బడ్జెట్ అంచనాల్లో రూ. 9.7 లక్షల కోట్ల అప్పులను అంచనా వేయగా, ఈ సారి మరో రూ. 2 లక్షల కోట్ల మేరకు అంచనాలు పెంచారు. అయితే, 2021–22 బడ్జెట్ లో రూ. 9,67,708 కోట్ల అప్పును అంచనా వేయగా, దానిని రూ. 8,75,771 కోట్లకు సవరించారు.

గతంలో తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించడం, ఫిస్కల్ డెఫిషిట్ ను సరిచేయడం కోసం డేటెడ్ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లుల ద్వారా ఈ మేరకు కేంద్రం రుణాలు సేకరించనుంది. అలాగే ఎకో ఫ్రెండ్లీ (గ్రీన్) ఇన్​ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కోసం సావరీన్ గ్రీన్ బాండ్లను జారీ చేయాలని కూడా ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇవి కూడా ఓవరాల్ గా ప్రభుత్వ అప్పుల్లో భాగంగా ఉంటాయన్నారు.