రైతులకు శుభవార్త : అన్ని పంటలకు గిట్టుబాటు ధర పెంచిన కేంద్రం

రైతులకు శుభవార్త : అన్ని పంటలకు గిట్టుబాటు ధర పెంచిన కేంద్రం

కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ, రైల్వే ఉద్యోగులతో పాటు రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది.  ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. డీఏ 42 శాతం నుంచి 46 శాతానికి పెంచుతూ  నిర్ణయం తీసుకుంది.  జులై 1 నుంచి పెరిగిన డీఏ వర్తించనుంది. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. డీఏ పెంపు నిర్ణయంతో 48.67 లక్షల మంది ఉద్యోగులకు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.   

Also Read : తెలంగాణలో 30 సీట్లు అయినా ఇవ్వాలి : బీజేపీతో జనసేన

ఆరు రబీ పంటలకు కేంద్ర కేబినెట్ మద్దతు ధరలు పెంచింది. క్వింటాల్ కందులపై 425 రూపాయలు పెంచారు. క్వింటాల్ గోదుమలకు 2 వేల 275 పెంచారు. బార్లీ మద్దతు ధర క్వింటగాకు 1850 రూపాయలుగా నిర్ణయించారు.   రైల్వే ఉద్యోగులకు ఏటా ఇచ్చే ఉత్పతాదకత ఆధారిత బోనస్‌కు సైతం కేంద్ర కేబినెట్‌ ఈ సందర్భంగా ఆమోదం తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 78 రోజులకు సమానమైన వేతనాన్ని బోనస్‌గా చెల్లించనున్నారు.