కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో దేశ వ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు చేపట్టింది. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ.. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్లు వచ్చాయి. ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సైతం.. ఈ డిమాండ్ పైనే ఉంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో.. లోక్ సభ, రాజ్యసభలో కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేసింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ.. దేశ వ్యాప్తంగా నిరనసలు మిన్నంటాయి.
ఈ క్రమంలోనే జంతర్ మంతర్ లో ఆమరణ దీక్ష చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరుపుతున్నది. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే.. చర్చలకు వస్తామని.. దీక్షలు, నిరసనలు విరమిస్తామని స్పష్టం చేసింది. మరోసారి చర్చలు ప్రారంభం కాబోతున్న సమయంలో.. విధిలేని పరిస్థితుల్లో.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.
26 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా మద్దతు వస్తుంది. మరోసారి దేశ వ్యాప్త నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ఈ విషయాలపై ఇప్పటికే RSS సైతం తన వైఖరి వెల్లడించింది. పట్టువిడుపులు ఉండాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రకటించారు. ఈ పరిణామాలు అన్నీ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. రోజు రోజుకు యువత దేశ వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతంగా చేస్తుండటంతో.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు రాజీనామా చేశారు.
Union Education Minister Dharmendra Pradhan resigns. pic.twitter.com/TaUjDUMAyd
— ANI (@ANI) July 25, 2026
