
కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ మంగళవారం పార్లమెంట్లో ఫుల్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ స్పీచ్ ప్రారంభించనున్నారు. రూరల్, అర్బన్ డెవలప్మెంట్, హౌసింగ్, రక్షణ, రైల్వే తదితర రంగాలకు ఈ బడ్జెట్లో టాప్ ప్రయారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. ఈసారి ట్యాక్స్ రిలీఫ్ ఉంటుందని ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు ఆశిస్తున్నారు.
2014 నుంచి రెండు దఫాలు బీజేపీకి కేంద్రంలో ఫుల్ మెజార్టీ ఉండగా.. ఈసారి మాత్రం కూటమి భాగస్వామ్యంతోనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో కూటమిలో కీలక భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, టీడీపీ తమ రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ నుంచి భారీగా నిధులు రాబట్టుకోవాలని భావిస్తున్నాయి.