రానున్న 10 ఏళ్లలో జీడీపీ వృద్ధి 6 శాతంపైనే: మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌

రానున్న 10 ఏళ్లలో జీడీపీ వృద్ధి 6 శాతంపైనే:  మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌

న్యూఢిల్లీ: రానున్న పదేళ్లలో ఏడాదికి 6 శాతం నుంచి  8 శాతం చొప్పున  ఇండియా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌  రైజినా డైలాగ్ 2024 సమ్మిట్​లో పేర్కొన్నారు. ఇన్నోవేషన్లకు ఇండియాను వేదికగా చేసుకోవాలని గ్లోబల్ కంపెనీలకు  సూచించారు. ఇండియా కోసం, గ్లోబల్ మార్కెట్ల కోసం ఇక్కడికి వచ్చి ప్రొడక్ట్‌‌లను డెవలప్ చేయాలని కోరారు. 

2047 నాటికి  అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి రానున్న ఐదేళ్లలో బలమైన పునాది పడుతుందని చెప్పారు.  మాన్యుఫాక్చరింగ్‌‌, ఎడ్యుకేషన్‌‌, టెక్నాలజీ, హెల్త్‌‌కేర్ సెక్టార్లపై వచ్చే ఐదేళ్లలో ఎక్కువ ప్రయారిటీ ఇస్తామని చెప్పారు. ట్యాలెంట్ ఉన్నవారి కోసం ఇండియా వైపు ప్రపంచం చూస్తోందని పేర్కొన్నారు.