టెర్రరిస్టులు పర్యాటకులను కాల్చి చంపితే.. నక్సలైట్లు అమాయకులను కాల్చి చంపుతున్నరు: బండి సంజయ్

టెర్రరిస్టులు పర్యాటకులను కాల్చి చంపితే.. నక్సలైట్లు అమాయకులను కాల్చి చంపుతున్నరు: బండి సంజయ్

పెద్దపల్లి: మావోయిస్టులపై బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. పహల్గాంలో టెర్రరిస్టులు పర్యాటకులను కాల్చి చంపితే.. ఇక్కడ మావోయిస్టులు అమాయక ప్రజలను కాల్చి చంపేస్తు్న్నారని విమర్శించారు. శాంతి చర్చలు జరపాలన్న మావోయిస్టులపై ప్రతిపాదనపై కూడా ఆయన మండిపడ్డారు. తుపాకులతో అడవిలో ఉన్నవారితో శాంతి చర్చలు ఎలా జరుపుతారని ప్రశ్నించిన బండి.. ఇకనైనా నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. 

మావోయిస్టులు ఆయుధాలు వదిలిస్తేనే శాంతి చర్చలు జరుపుతామని.. లేదంటే ఎలాంటి చర్చలు ఉండవని కుండబద్దలు కొట్టారు. ఎంతో మంది రాజకీయ నాయకులను నక్సలైట్లు  కాల్చి చంపారని ఫైర్ అయ్యారు. మావోయిస్టు సానుభూతిపరులు  హరగోపాల్, వరవరరావు ఏం సాధించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

ALSO READ | పౌరసత్వం కేసు: అలహాబాద్ హైకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్

సోమవారం (మే 5) పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో కేంద్ర మంత్రి బండి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెడుతుందని విమర్శించారు.

 గత బీఆర్ఎస్ ప్రభుత్వ మాదిరిగానే కాంగ్రెస్ సర్కార్ కూడా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా కుల గణన సర్వే చేసిందని.. ఈ సర్వేలో బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే కులగణన ద్వారా బీసీలకు సముచిత న్యాయం జరుగుతోందని పేర్కొన్నారు.