కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ అబద్ధాలు చెబుతున్నరు..    ఎప్‌‌‌‌స్టీన్‌‌‌‌తో మీటింగ్లపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్

కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ అబద్ధాలు చెబుతున్నరు..    ఎప్‌‌‌‌స్టీన్‌‌‌‌తో మీటింగ్లపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్

న్యూఢిల్లీ: ఎప్‌‌‌‌స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి అబద్ధాలు చెబుతున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌‌‌‌స్టీన్‌‌‌‌తో 2014, 2017 మధ్య జరిగిన ‘62 ఇ మెయిల్ సంభాషణలు’, ‘14 సమావేశాల’పై ఆయన స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని పట్టుబట్టింది. ఈ మేరకు మంగళవారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మీడియా, పబ్లిసిటీ డిపార్ట్‌‌‌‌మెంట్ హెడ్ పవన్ ఖేరా మీడియాతో మాట్లాడారు.

“2014 నుంచి 2017 మధ్య హర్దీప్ సింగ్ పురి, ఎప్‌‌‌‌స్టీన్ మధ్య 62 ఇ మెయిల్ సంభాషణలు జరిగాయి. ఇవి మాత్రమే కాకుండా 2014 జూన్ 5, 6, 8, 9 తేదీల్లో, సెప్టెంబర్ 19, 23, 24 తేదీల్లో, అక్టోబర్ 9, 10 తేదీల్లో వీరిద్దరు సమావేశమయ్యారు. అసలు ఈ మీటింగ్‌‌‌‌ల్లో ఏం చర్చించారు?”అని ప్రశ్నించారు.

‘‘హర్దీప్ సింగ్ పురి 32 ఇమెయిల్స్ పంపగా, ఎప్‌‌‌‌స్టీన్ ఆయనకు 30 ఇమెయిల్స్ పంపారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ పదవి చేపట్టిన వెంటనే ప్రారంభమైన ఈ సమావేశాలు 2017 వరకు కొనసాగాయి. అసలు ప్రశ్న ఏంటంటే -2014 జూన్‌‌‌‌లో హర్దీప్ సింగ్ పురి ఏ పదవిలో ఉన్నారు? ఏ హోదాలో ఆయన ఎప్‌‌‌‌స్టీన్‌‌‌‌ను కలిశారు?" అని పవన్ ఖేరా నిలదీశారు.