విద్యాంజలి అమలులో తెలంగాణ వెనుకబడింది : కేంద్రమంత్రి జయంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చౌదరి

విద్యాంజలి అమలులో తెలంగాణ వెనుకబడింది : కేంద్రమంత్రి జయంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చౌదరి
  • కేంద్రమంత్రి జయంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చౌదరి వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: ‘విద్యాంజలి’ ప్రొగ్రామ్ అమలులో తెలంగాణ వెనుకబడిపోయిందని  కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని దాదాపు 82 శాతం ప్రభుత్వ పాఠశాలలు విద్యాంజలి పోర్టల్‌‌‌‌‌‌‌‌లో నమోదయ్యాయి. అయితే, ఇప్పటివరకు కేవలం 2,179 మంది వాలంటీర్లు మాత్రమే నమోదు చేసుకున్నారు.

అస్సాం, హిమాచల్ ప్రదేశ్ వంటి చిన్న రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో వాలంటీర్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపింది.బుధవారం రాజ్యసభ క్వశ్చన్ అవర్ లో ‘విద్యాంజలి పథకం’పై ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్‌‌‌‌‌‌‌‌ చౌదరి సమాధానమిచ్చారు. తెలంగాణలో ఒక్క స్కూల్ కూడా ఎవరూ దత్తత తీసుకోలేదని మంత్రి పేర్కొన్నారు.