అల్లూరి గొప్పతనం కృష్ణ సినిమాతో అందరకీ తెలిసిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ లోని ఫిలీంనగర్ కల్చరల్ క్లబ్ లో ఇవాళ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు సినిమా తీసిన సూపర్ స్టార్ కృష్ణను సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సినీ నటుడు మెహన్ బాబు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన కిషన్ రెడ్డి.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా గుర్తింపు పొందిన స్వాతంత్ర్య సమరయోధులను గుర్తించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిందన్నారు. . బ్రిటీష్ వారికి వణుకు పుట్టించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజు అని అన్నారు.
హైదరాబాద్ లో నిర్మిస్తున్న రాంజీ గోండ్ మ్యూజియాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు . విశాఖ లంబసింగిలో కడుతున్న మ్యూజియాన్ని సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 13న అల్లూరి సీతారామరాజు సొంత గ్రామం మొగల్లుకు వెళ్తున్నామన్నారు. హైదరాబాద్ లో అల్లూరి మ్యూజియానికి రూ.18 కోట్లు కేటాయించామన్నారు. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వానికి కేంద్రం కోటి రూపాయలు విడుదల చేసిందన్నారు.