కేసీఆర్ను చూసి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు

కేసీఆర్ను చూసి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు

తెలంగాణను చూసి దేశమంతా పాఠం నేర్చుకోవాలని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.  టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసి ఏదీ నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘విజయ సంకల్ప సభ’లో ఆదివారం సాయంత్రం మాట్లాడారు. ‘‘ అవినీతిమయ రాజకీయాలను చూసి నేర్చుకోవాలా ? కుటుంబ రాజకీయాలను చూసి నేర్చుకోవాలా ? మజ్లిస్ తో మీ పొత్తును చూసి నేర్చుకోవాలా?’’ అని కేసీఆర్ పై కిషన్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘సీఎం కేసీఆర్ గత 8 ఏళ్లుగా సచివాలయానికి రాలేదు.. సెక్రటేరియట్ ను కూడా కూలగొట్టించారు.. అక్రమాల పాలన చేస్తున్నారు. అహంకార పూరిత పాలన చేస్తున్నారు. మీ లాంటి వాళ్లను చూసి మేం నేర్చుకోవాలా ?’’ అని ఆయన వ్యా్ఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తే టీఆర్ఎస్ కంటే మంచిపాలన, నీతివంతమైన పాలన అందిస్తామన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా తమ పాలన సాగుతుందన్నారు. తెలంగాణ ద్రోహులను వెంటపెట్టుకొని పాలన చేస్తున్న కేసీఆర్ ను పట్టించుకునే ప్రసక్తే లేదని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.