
హైదరాబాద్ లోని వేలాది బస్తీలలో తాగునీటి సౌకర్యం, రోడ్లు, డ్రైనేజీ లేక జనం ఇబ్బందులు పడ్తున్నారన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ బస్తీలలో పర్యటించిన ఆయన స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. రాష్ట్ర ఆదాయంలో 80 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సిటీని పట్టించుకోవడం లేదన్నారు. రోడ్ల మీద లైట్లు వేసి డల్లాస్, సింగపూర్, ఇస్తాంబుల్ అని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు కిషన్ రెడ్డి.
దళిత బంధు విషయంలో నిజమైన దళితులకు ఇవ్వకుండా బీఆర్ఎస్ కార్యకర్తలకు దళిత బందు ఇచ్చారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు కోట్ల విలువ చేసే భూములను కేటాయించుకుంటున్నారన్నారు. హైదరాబాద్ నగరంలో కొత్తగా నాలుగు రైల్వే స్టేషనులను నిర్మాణం చేపట్టామని కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి నూతనంగా ఆధునికరణతో నిర్మాణాలు చేపట్టడం చేపడుతున్నామని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్రం రూ. 25 వేల కోట్లను కేటాయించిందని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం జరుగుతే యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని తెలిపారు.