కవిత అరెస్టుకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు : కిషన్ రెడ్డి

కవిత అరెస్టుకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు :  కిషన్ రెడ్డి

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కి తెలంగాణ బీజేపీకి  ఎలాంటి సంబంధం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.  లిక్కర్ స్కామ్ లో తీగలాగితే కవిత పేరు బయటపడిందన్నారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ పార్టీ కార్యలయంలో  కిషన్ రెడ్డి మాట్లాడారు.  తెలంగాణ ప్రజల కోసం కవిత ఢిల్లీ లో లిక్కర్  వ్యాపారం చేసిందా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.  లిక్కర్ వ్యాపారాన్ని బీఆర్ఎస్ పూర్తిగా ప్రోత్సహించిందన్న ఆయన... అదే తీరులో కాంగ్రెస్ నడుస్తుందని విమర్శించారు.   

అవినీతి జరిగితే బీజేపీ చర్యలు  తీసుకుంటుందని..   అదే బీజేపీ నినాదమని చెప్పారు కిషన్ రెడ్డి.   అవినీతి పరులు ఎవరైన వదిలే ప్రసక్తే లేదన్నారు. 2047 వరుకు దేశం అభివృద్ధి చెందాలంటే అది కేవలం ప్రధాని మోదీ తోనే  సాధ్యమని చెప్పుకోచ్చారు.  100వ స్వాతంత్ర పండుగ జరుపుకున్న నాటికి దేశం అభివృద్ధిగా ఉండాలనేది మోదీ లక్ష్యమని స్పష్టం చేశారు.   

ALSO READ | బీఆర్ఎస్ కు రాజీనామా.. బీజేపీలో చేరిన ఆరూరి రమేశ్

ప్రస్తుతం ఇప్పుడు అందరూ ఆర్జీ( రాహుల్ గాంధీ)టాక్స్  కట్టాలన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ మార్పు అంటే ఏదో కాదు ఇదేనన్నారు.  పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ కు హైదరాబాద్ నుంచి పూర్తిగా ఆర్థిక వనరులు చేరబోతున్నాయని చెప్పారు. ప్రతి దాంట్లో రాహుల్ గాంధీ ట్యాక్స్ కట్టాలని ఆరోపించారు.