కార్మికుల్ని తీసేయాలని ఏ చట్టంలోనూ లేదు
హైదరాబాద్, వెలుగు: హుజుర్ నగర్‌లో గెలవగానే సీఎం కేసీఆర్ ఆగుతలేడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఇల్లు అలకగానే పండుగ అంటే ఎట్లా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని, కేసీఆర్ కు అది తెలిసొచ్చే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. ఎర్రగడ్డలోని ఆయుర్వేద కాలేజ్ లో జరిగిన జాతీయ ఆయుర్వేద దినోత్సవ కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రాచీన కాలం నుంచి కొనసాగుతూ వస్తున్న ఆయుర్వేదంపై జనాల్లో మరింత అవగాహన తెచ్చేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెపై స్పందిస్తూ.. సమ్మె విషయంలో కేసీఆర్ తీరును మంత్రి తప్పుబట్టారు.