ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న కిషన్ రెడ్డి, ప్రకాష్ జవదేకర్ 

ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న కిషన్ రెడ్డి, ప్రకాష్ జవదేకర్ 

తెలంగాణ వ్యాప్తంగా  వినాయక  ఉత్సవాలను ప్రజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు  చేశారు. ఖైరతాబాద్ పంచముఖ మహాలక్ష్మి గణపతిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,మాజీ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్,పలువురు బీజేపీ నాయకులు దర్శించుకున్నారు. ఖైరతాబాద్ గణేషుడిని 68 ఏండ్లుగా పూజిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. ఈసారి మట్టి గణనాథుడిని ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. కుల మతాలకు అతీతంగా అందరిలో ఐక్యత నింపేందుకు బాలగంగాదర్ తిలక్ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారన్నారు. ఏ  కార్యక్రమం మొదలుపెట్టినా  ముందుగా పూజించేది వినాయకుడినేని చెప్పారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యుల కు తన తరపున ప్రధాని మోడీ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు.

ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ప్రకాష్ జవదేకర్ అన్నారు. ఖైరతాబాద్ గణనాథుడిని మట్టి తో తయారుచేసినందుకు అభినందనలు తెలియజేశారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత  అందరిపై ఉందన్నారు.   ఖైరతాబాద్ గణేశుడు దేశంలో నే అతిపెద్ద వినాయకుడు అన్నారు.