CRPC, IPC చట్టాల్లో మార్పులు తీసుకొస్తాం

CRPC, IPC చట్టాల్లో మార్పులు తీసుకొస్తాం

హైదరాబాద్: బ్రిటీష్ కాలం నాటి సీఆర్పీసీ, ఐపీసీ చట్టాలను మారుస్తామ‌ని కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలో బ్రిటీష్ కాలం నాటి చట్టాలే ఇంకా అమలు జరుగుతున్నాయని, ఆ చట్టాలను మార్చాలని కేంద్రం ఆలోచన చేస్తుందన్నారు. త్వ‌ర‌లోనే సీఆర్పీసీ, ఐపీసీ  చట్టాలకు మార్పులు చేస్తామ‌ని, దీనికోసం సమాజంలోని కీలకమైన వ్యక్తులు, మేధావుల నుండి సలహాలు తీసుకుంటామ‌ని ఆయ‌న చెప్పారు. సోమ‌వారం న‌గ‌రంలోని బేగంపేట్ క్ష‌త్రియ హోటల్ లో బీజేపీ మహిళ మోర్చా ఆధ్వర్యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మానికి కిష‌న్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. హైదరాబాద్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావ్ కు మద్దతు గా బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేయ‌నున్నారు.

TRS పార్టీ జోరు మీద ఉన్నపుడు బీజేపీ ఎమ్మెల్సీ లు విజయం సాధించారని, విద్యావంతులు.. మేధావులు.. ఉద్యోగులు TRS పార్టీ కి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. రామచంద్రరావు ఉద్యమం లో పోరాడిన వ్యక్తి.. నీతి నిజాయితీ గా పని చేసే వ్యక్తి అని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచేలా ప్ర‌తీ కార్య‌క‌ర్త ప‌నిచేయాల‌న్నారు. ఈ కార్య‌క‌మంలో జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ రహత్కర్, రాష్ట్ర బీజేపీ మాహిళ మోర్చాఅధ్యక్షురాలు గీతా మార్తి పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలో మహిళ మేధావులు, విద్యావంతులు పాల్గొన్నారు.