ఏపీ, తెలంగాణలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చెస్తం

ఏపీ, తెలంగాణలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చెస్తం

భారతదేశంలోని మ్యూజియంలను రీఇమేజింగ్ చేయడంపై  కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ గ్లోబల్ సమ్మిట్ ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. రెండు రోజులపాటు ఆన్లైన్ ఫ్లాట్ ఫామ్ ద్వారా జరగనున్న ఈ సమ్మిట్ లో ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇటలీ, సింగపూర్, యూ.ఏ.ఈ., యూ.కే., అమెరికా, భారత్ వంటి ఎనిమిది దేశాలకు చెందిన మూడువేల మంది డెలిగేట్స్ పాల్గొంటున్నారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ..  నిజాం నగలు తెలంగాణకి తీసుకురాడానికి కృషి చేస్తామన్నారు.  ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సెక్యురిటితో కూడిన ఒక భవనం ఏర్పాటు చేస్తే మేము ముందుకోస్తామన్నారు.  హైదరాబాద్ లో సైన్స్ సిటీ ఏర్పాటు చేయదానికి కేంద్రం ముందుకొచ్చిందని మంత్రి తెలిపారు.  దీనికి 25 ఎకరాలు ల్యాండ్ అవసరం ఉందన్నారు. ల్యాండ్ కేటాయించాలని సీఎం కేసీఆర్ కి లేఖ రాశామన్నారు. ఆ లేఖకు ఇంకా రిప్లై రాలేదన్నారు. తెలంగాణలో కొమరం భీమ్, ఆంద్రప్రదేశ్‌లో అల్లూరి సీతారామరాజు పేరుతో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.  కొమరం భీమ్ కోసం 18 కోట్లు, అల్లూరి సీతారామరాజు కోసం 35 కోట్ల రూపాయల్ని కేటాయించామమన్నారు. 

 భారతదేశం మానవ నాగరికత ప్రారంభమైనప్పటి నుండి గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన భూమి అన్నారు కిషన్ రెడ్డి.  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను జరుపుకుంటున్న తరుణంలో, మన సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం, శాశ్వతంగా కొనసాగించడం పట్ల కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.  భారతదేశంలోని 1000కి పైగా మ్యూజియంలు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడంలో భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. గత ఏడేళ్లుగా కొత్త మ్యూజియంలను నిర్మించడంపై  దృష్టి సారిస్తున్నామన్నారు.  ఇప్పటికే ఉన్న మ్యూజియంలను కొత్త తరానికి అనువుగా ఉండేలా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య సమరయోధుల పేరుతో 10నూతన మ్యూజియంలను ఏర్పాటు చేయబోతున్నామని కేంద్రమంత్రి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నంలో మ్యూజియంలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఇవి కూడా చదవండి: 

సీఎం కేసీఆర్ పై ఫిర్యాదు!