బీజేపీ చీఫ్ నడ్డాకు సమాధి కట్టడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్

బీజేపీ చీఫ్ నడ్డాకు సమాధి కట్టడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
  •  మా సహనాన్ని అసమర్థతగా భావించవద్దు
  • మేం తెగిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటయ్
  • కేసీఆర్ దిష్టిబొమ్మలు తగలబెడితే కేసులు పెట్టి జైలుకు పంపుతరు
  • బీజేపీ నేతలకు సమాధులు కట్టే మిమ్మల్ని ఏం చేయాలి?

 

హైదరాబాద్, వెలుగు: ‘‘బతికున్న వారికి సమాధులు కట్టి.. పసుపు కుంకుమ చల్లి నివాళులర్పించే నీచ, నికృష్టపు సంస్కృతికి టీఆర్ఎస్ పాల్పడుతున్నది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్‌‌‌‌లో సమాధి కట్టి, అంత్యక్రియలు నిర్వహించి అవమానపరిచారు. ఇలాంటి వికృత, ఉన్మాద చర్యలకు అధికార పార్టీ తెర లేపింది. మా సహనాన్ని అసమర్థతగా భావించవద్దు.. మేం తెగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి” అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలు తగులబెడితేనే కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని, మరి ఇప్పుడు నడ్డాకు సమాధి కట్టిన టీఆర్ఎస్ లీడర్లను ఏం చేయాలని ప్రశ్నించారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో కపిలవాయి దిలీప్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి మీడియాతో కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్యామ్య పాలన సాగడం లేదని, నిజాం పాలన సాగుతున్నదని ధ్వజమెత్తారు. 

నిజాం పాలనా?
‘‘మాకు సభ్యత, సంస్కారం ఉంది కాబట్టే.. మీరు ఎన్ని అప్రజాస్వామిక విధానాలకు పాల్పడినా, ఎన్ని అవినీతి, అక్రమాలకు పాల్పడినా సహనంతో ఉన్నాం. మేం కల్వకుంట్ల కుటుంబం కోసం పని చే యడం లేదు. దేశం కోసం పని చేస్తున్నాం. అందుకే మౌనంగా ఉంటున్నాం” అని కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. పుత్ర వాత్సల్యం కోసం టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ను బీఆర్ఎస్ చేశారని, తెలంగాణ అనే పేరుతో ఉద్యమం చేసి అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు ఆ పదం లేకుండా చేశారని విమర్శించారు. 

కమీషన్‌‌‌‌‌‌‌‌ లేని కాంట్రాక్టే లేదు
తెలంగాణను దోచుకున్నది సరిపోక, ఇప్పుడు దేశా న్ని దోచుకునేందుకు విమానం కొన్నారని కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి నిప్పులు చెరిగారు. ‘‘తెలంగాణలో కమీషన్ లేని కాంట్రాక్టే లేదు. టీఆర్ఎస్ నాయకులు దోచుకోని రంగమే లేదు. వారికి రియల్ ఎస్టేట్ సెక్టార్ బంగారు బాతులా మారింది. దోచుకోవడం, దాచుకోవడం.. అక్రమ సంపాదనను ఎన్నికల్లో ఖ ర్చు పెట్టడం.. అధికార దుర్వినియోగానికి పాల్పడటం. నిజాం పాలనను తలపిస్తున్నారు” అని విమర్శించారు. 

గ్రామానికి ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌గా సీఎంనా?
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనను కల్వకుంట్ల మాఫియా రాజ్యాంగంగా మార్చారని కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం చెప్పే అబ ద్ధాలకు ఊసరవెళ్లి కూడా సిగ్గుపడుతుందన్నారు. ‘‘మునుగోడు ప్రజలు మంచి తీర్పును ఇవ్వబోతున్నారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. అది మునుగోడు ఫలితంలో ప్రతిబింబించనుంది. హుజూరాబాద్ ఫలితమే మునుగోడులో రానుంది. కేసీఆర్.. సీఎం హోదాలో ఉంటూ మునుగోడులో ఒక గ్రామానికి ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌గా ఉండడం ఏమిటి? దేశంలో ఇలాంటిది ఎక్కడా లేదు” అని అన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ గురించి టీఆర్ఎస్ మాట్లాడుతున్నదని, 9 ఏండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఇక్కడ ఫ్లోరైడ్ నివారణకు తీసుకున్న చర్యలు ఏమిటని ప్రశ్నించారు. 

మునుగోడులో సర్పంచులపై తప్పుడు కేసులు: దిలీప్ కుమార్
మునుగోడులో సర్పంచులపై తప్పుడు కేసులు పెడుతున్నారని, అధికారులు టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ ఎన్నికల నిబం ధనలను తుంగలో తొక్కారని మాజీ ఎమ్మెల్సీ, మునుగోడు బీజేపీ అభ్యర్థికి ఎన్నికల ఏజెంట్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్న కపిలవాయి దిలీ ప్ కుమార్ ఆరోపించారు. రోడ్ రోలర్ గుర్తు కేటాయింపులో కూడా అధికారులు టీఆర్ఎస్ ఒత్తిడికి లొంగి వ్యవహరించారన్నారు. హైకో ర్టుకు కూడా తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని విమర్శించారు. అనుమతులు లేకుండా టీఆర్ఎస్  ఎక్కడపడితే అక్కడ హోర్డింగ్‌‌‌‌‌‌‌‌లు, కటౌట్లు, తోరణాలు పెట్టిందని, అయినా అధికారులు ఎన్నికల కోడ్‌‌‌‌‌‌‌‌ను అమలు చేయడం లేదన్నారు.