కల్వకుంట్ల రాజ్యాంగం ప్రకారమే బండి సంజయ్ ని A1గా పెట్టిన్రు : కిషన్ రెడ్డి

కల్వకుంట్ల రాజ్యాంగం ప్రకారమే బండి సంజయ్ ని A1గా పెట్టిన్రు : కిషన్ రెడ్డి

బండి సంజయ్ అరెస్ట్ దుర్మార్గమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కల్వకుంట్ల రాజ్యాంగం ప్రకారం బండి సంజయ్ ను ఏ1 గా పెట్టారని విమర్శించారు.  కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు.  కేసులకు, జైళ్లకు బీజేపీ నాయకులు భయపడబోరన్నారు. ప్రజల కోసం లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలు జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని.. కొత్త జైలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

బండి సంజయ్ ని అర్ధరాత్రి  అరెస్ట్ చేసి మానసికంగా వేధించారని  కిషన్ రెడ్డి అన్నారు. టాబ్లెట్ లు కూడా వేసుకోనివ్వలేదని.. టెర్రరిస్టులను కూడా వాహనాలను మారుస్తూ తీసుకుపోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కళ్లల్లో ఆనందం చూడటం కోసమే పోలీసులు బండి సంజయ్ ను అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో  కేసీఆర్ అరాచక పాలన కనిపిస్తోందన్నారు.  

అధికారం చేతుల్లో ఉంది కదా అని కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.  బీఆర్ఎస్ నేతలతోనూ పేపర్ లీక్ నిందితుడు ప్రశాంత్ ఫోటోలు దిగాడని..అంత మాత్రానా వాళ్లతో సంబంధం ఉన్నట్టా అని ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే బండి సంజయ్ ను  అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాజకీయ నాయకులకు జర్నలిస్ట్ లు సమాచారం ఇవ్వడం తప్పా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.  ప్రతిపక్షంగా తాము పోరాటం చేస్తున్నామని.. అధికారులు, రిపోర్టర్ లు , ఐఏఎస్ లు తమకు సలహాలు, సూచనలు ఇవ్వడం తప్పేలా అవుతుందన్నారు. బండి సంజయ్ కి పేపర్ రావడం కంటే ముందే పేపర్ లలో, టీవీలలో, సోషల్ మీడియాలో వచ్చిందన్నారు. ప్రగతి భవన్ రాసిచ్చిన స్క్రిప్ట్ ను  పోలీసులు బాగా అమలు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని మండిపడ్డారు. లక్షలాది మంది