దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా కేంద్రం కృషి 

దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా కేంద్రం కృషి 

హైదరాబాద్: దివ్యాంగుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని నాంపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లు, చేతి కర్రలు, మొబైల్ ఫోన్లు, కృత్రిమ అవయవాలు, వినికిడి యంత్రాలను మంత్రి కిషన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వాలు ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలో దివ్యాంగులకు వాటా ఉంటుందన్నారు. కుటుంబ సభ్యులు ఉన్నంత కాలం దివ్యాంగుల జీవితాలు బాగుంటాయన్న ఆయన... వాళ్లు చనిపోయాక దివ్యాంగుల పరిస్థితి దయనీయంగా మారుతుందన్నారు.

ఇలాంటి పరిస్తితుల్లో దివ్యాంగుల బాగోగులు చూసుకోవాల్సని బాధ్యత ప్రభుతం, సమాజంపై ఉండాలన్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం దేశంలోని చివరి దివ్యాంగుడి వరకు అన్ని ప్రయోజనాలను అందిస్తున్నామని తెలిపారు. అలాగే దేశంలోని వయోవృద్ధులకు అవసరమైన పరికరాలను అందిస్తున్నామని మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.