కశ్మీర్ ఇప్పుడు ప్రశాంతం..రాళ్లు విసురుడు లేదు తుపాకీ మోత లేదు

కశ్మీర్ ఇప్పుడు ప్రశాంతం..రాళ్లు విసురుడు లేదు తుపాకీ మోత లేదు
  • కాశ్మీర్ ఇప్పుడు శాంతికి నిలయం: కిషన్‌రెడ్డి
  • ‘ఒకే దేశం, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం’ నినాదాన్ని చేసి చూపించాం
  • జమ్మూకాశ్మీర్, లడక్ ప్రజలకు అభివృద్ధిని చూపిస్తున్నం
  • వేర్పాటువాద చర్యలను కట్టడి చేసినం
  • అందరికీ అందేలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని వెల్లడి
  • ఆర్టికల్ 370 రద్దై ఏడాది కావడంతో ‘వీ6 వెలుగు’కు స్పెషల్ ఇంటర్వ్యూ

కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసి ఏడాది అవుతోంది.వేర్పాటువాదం తగ్గుతుందని కేంద్రం చెప్పింది? ఇప్పుడది ఎంతవరకు నిజమైంది?

కిషన్రెడ్డి: ఇప్పుడు జమ్మూకాశ్మీర్లో వేర్పాటు వాదం లేదు. గతేడాది ఆగస్టు5న మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయానికి దేశమంతా ఆనందం వ్యక్తం చేసింది. ఇన్నాళ్లూ 370, 35(ఎ) సెక్షన్లను అడ్డుపెట్టుకొని కాశ్మీర్ లో టెర్రరిజం పెచ్చుమీరింది. చాలాఏళ్లు అశాంతి నెలకొంది. వేల సంఖ్యలో సైనికులు బలిదానం చేయాల్సి వచ్చింది. కాశ్మీర్ ను ఇండియా నుంచి వేరు చేసేందుకు జరుగుతున్న కుట్రలకుచెక్‌ పెడుతూ ‘ఒకే జెండా, ఒకే దేశం,ఒకే రాజ్యాంగం’ నినాదం తీసుకున్నాం. ఇప్పుడు కాశ్మీర్ లో రాళ్లు విసరడాలు లేవు. తుపాకీ కాల్పుల మోతలు పాకిస్థాన్ సరిహద్దులకే పరిమితమయ్యాయి. జమ్మూకాశ్మీర్లో ఇప్పుడు శాంతి నెలకొంది.
కాశ్మీర్ లోయలో పరిస్థితి పూర్తిగా చక్కబడలేదు. కరోనాతో పరిస్థితి సున్నితంగా మారింది. కేంద్రం దీన్నెలా హ్యాండిల్ చేస్తోంది.
కరోనా ఎఫెక్తో ట్ మరిన్ని పటిష్టచర్యలు చేపట్టినం. వైరస్ను అరికట్టడంతో పాటు ఉగ్రవాదుల నిర్మూలనకు కృషి చేస్తున్నం. స్థానిక మత పెద్దలు పోలీసులతో కలసి విశాఖి, ఈద్, నవరాత్రి పండుగల టైంలో మసీదులు, ఆలయాల వద్ద రూల్స్ ప్రకారం వ్యవహరించారు. ఆర్టికర్టిల్ 370 రద్దు తర్వాత కేంద్రం పూర్తిగా జమ్మూకాశ్మీర్ అభివృద్ధి,భద్రతా అంశాలపై దృష్టి పెట్టింది. గత అనుభవాలను దృష్టిలో ష్టి పెట్టుకొని కేంద్ర హోంశాఖ, స్థానికపోలీసులు, పారామిలటరీ ఫోర్స్ సంయుక్తంగా టెర్రరిజాన్ని సమరవంతంగా అడ్డుకుంటున్నాయి. శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి.

కేంద్ర నిర్ణయంపై కాశ్మీరీ పండిట్ల స్పందన ఏంటీ? కొత్త రూల్స్ వల్ల 20 వేల మందికి నివాస హక్కులు వచ్చాయన్న వార్తలు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయని అంటున్నారు.

ఆర్టికర్టిల్ 370, 35ఏలను రద్దుచేస్తే కాశ్మీర్ ప్రజలను భారతదేశానికి మరింత దూరం చేసినట్లేనన్న విమర్శలు వచ్చాయి. కశ్మీరీలు తిరగబడతారని, దేశ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందనీ అన్నారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. అక్కడి ప్రజలు మరింతగా భారతదేశంలో మమేకం అవుతున్నారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోతమకు నచ్చిన వ్యక్తులను పెళ్లిచేసుకునే స్వే చ్ఛవారికి లభించింది. కేంద్ర నిర్ణయాన్ని కశ్మీరీలు మనస్పూర్తిగా స్వాగతిస్తున్నారు. పండిట్లకు న్యాయం చేస్తం.

కాశ్మీర్లో ఏడాదిగా రాజకీయ పార్టీలు క్రియాశీలకంగా లేవు. ఇటీవలి దాకా నేతలను నిర్బంధించారు. ప్రతిపక్షాలకు వైఖరి చెప్పడానికి అవకాశం ఉండాలి కదా?

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం బీజేపీ చేయదు. 370 అధికరణం తొలగించేటప్పుడు ముందుజాగ్రత్తగా, శాంతిభద్రతల కోసం 229 మంది వేర్పాటువాద నాయకులను అదుపులోకి తీసుకున్నారు. చాలా మందిని విడుదల చేశారు. భారత్పై విష ప్రచారం చేసే అవకాశం ఉన్నందున కొంతకాలం పాటు ఇంటర్నెట్ను ని షేధించినా.. ఇప్పుడు విడతల వారీగా పునరుద్ధరించాం. ప్రస్తుం జమ్ము, కాశ్మీర్ లో అభివృద్ధి, శాంతిసామరస్యం, పౌరహక్కులు, మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం నిరంతరంగా పనిచేస్తోంది.

గిలానీ రాజీనామాతో వేర్పాటువాదులకు ఎదురుదెబ్బ తగిలిందంటున్నారు. అదే టైంలో యువత ర్యాడికల్ గా మారే ప్రమాదముందన్న ఆందోళన ఉంది. ఏమంటారు?

నిరుద్యోగం, నిరక్షరాస్యత కారణంగా గతంలో యువత టెర్రరిజం వైపు వెళ్లారు. డబ్బు తీసుకుని భద్రతా దళాలపైకి రాళ్లురువ్వేవారు. 2016లో ఏకంగా 2,653 అలాంటి ఘటనలు జరిగాయి. ఇందుకోసం పాకిస్థాన్ డబ్బు సరఫరా చేసేదని, ఒక్కొక్కరికి రోజుకు రూ.500 చొప్పున ఇచ్చేదని తేలింది. ఇప్పుడు అక్కడి యువతకు ఉపాధిదొరుకుతోంది. గత ఏడాది కాలంలో ఒక్కటంటే ఒక్కటి కూడా రాళ్లు విసిరిన ఘటన జరగలేదు.స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారిగా అభివృద్ధిపనుల కోసం నేరుగా పంచాయతీ సర్పంచుల ఖాతాల్లోకి నిధులు వెళ్తున్నాయి. స్థానికంగా అభివృద్ధికార్యక్రమాలు చేపడుతున్నారు. యువత అభివృద్ధికి జైకొడుతున్నారు.

2020లో ఇప్పటిదాకా 148 మంది టెర్రరిస్టులు హతమైనట్టు ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి.అయితే కొత్త టెర్రరిస్టుల నియామకాలు తగ్గడం లేదని లోకల్ మీడియా అంటోంది.

అది పూర్తిగా తప్పు. టెర్రరిస్టు కార్యకలాపాల విచ్ఛిన్నమే లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయి. బేస్ లెవల్ నుంచీ టెర్రరిస్టులకు సహకరించే, నిధులు అందజేసేవాళ్లు, మత్తు పదార్థాలు పంపిణీ చేసే వ్యక్తుల వ్యవస్థలన్నీ ధ్వంసం చేశాం. జిలానీ,హురియత్, ఇతర వేర్పాటువాదుల కార్యకలాపాలను నియంత్రించాం . గతంలో ప్రతిచోటా కనిపించే పోస్టర్ లు, బ్యానర్లు, పాకిస్థాన్ జెండాలు నామమాత్రంగా కనిపిస్తున్నాయి. చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో తుపాకుల కాల్పుల వందనాలు, వేర్పాటువాద నినాదాలు వినిపించట్లేదు. ఇది టెర్రరిస్టులకు జనం నుంచి ఎలాంటి మద్దతు దొరకదనేసందేశాన్ని ఇస్తోంది. ఇక టెర్రరిస్టుల ఏరివేతపైనా కేంద్రం దృష్టి పెట్టింది. ఈ ఏడాది 148 మంది టెర్రరిస్టులను న్యూట్రలైజ్ చేయగా.. తొలిసారి అత్యంత తక్కువగా 26 ఉగ్రవాద చొరబాట్లు మాత్రమే జరిగాయి. జనం ప్రాణనష్టం 22కు తగ్గింది. భద్రతా బలగాల మరణాలు తగ్గాయి.

ఇప్పుడు కాశ్మీర్, లడాఖ్‌ ప్రజలకు కేంద్ర పథకాలు అందుతున్నాయి.అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకున్నాయి.మౌలిక వసతులు, విద్య,వైద్యం, ఉపాధి కల్పనపై ప్రత్యేకంగా దృష్టిసారించాం. రాష్ట్రంలోని 100% స్కూళ్లకు కరెంటు సౌకర్యం కల్పించాం. కాశ్మీర్ లో 2 ఎయిమ్స్ హాస్పిటల్స్ తో పాటు కొత్తగా ఐదు మెడికల్ కాలేజీలను కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రధాన మంత్రి అభివృద్ధి ప్యాకేజీ కింద జమ్మూకశ్మీరుకు రూ.80 వేల కోట్లు మంజూరు చేశారు. ఇక కొండలు,మంచు పర్వాతాలతో కూడిన లోయలో రోడ్లు, వంతెనల పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 90 వేల ఇండ్లు మంజూరు చేయగా.. ఇప్పటికే 20 వేల ఇండ్లు పూర్తయ్యాయి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధికింద దాదాపు 10 లక్షల మందికి రైతు సాయం అందుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ తమకు అందుతున్నాయన్న సంతోషం ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతోంది.