
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేనల్లుడు జీవన్ రెడ్డి(47) ( సోదరి కుమారుడు) గుండెపోటుతో మరణించారు. కంచన్ బాగ్ డీఆర్డీఏ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు. హైదరాబాద్ లోని తన నివాసంలో నిన్న ఒక్కసారిగా కుప్పకూలారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. నోయిడాలో ఉన్న కిషన్ రెడ్డికి ఈ విషయం తెలియడంతో వెంటనే హైదరాబాద్ కు బయల్దేరారు. జీవన్ రెడ్డికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.