పాకిస్తాన్​లో కన్నా ముస్లింలు ఇండియాలోనే సంతోషంగా ఉన్నారు

పాకిస్తాన్​లో కన్నా ముస్లింలు ఇండియాలోనే సంతోషంగా ఉన్నారు

వాషింగ్టన్: ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్​లో కన్నా ముస్లింలు ఇండియాలోనే ఎక్కువ సంతోషంగా ఉన్నారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇండియా రెండో స్థానంలో ఉందని, 1947 నుంచి ఇప్పటివరకు దేశంలో ముస్లిం జనాభా ఎంతో పెరిగిందని చెప్పారు.

ఇండియాలో ముస్లింలు దాడులు ఎదుర్కొంటున్నట్లయితే వాళ్ల జనాభా ఈ స్థాయిలో పెరిగేది కాదన్నారు. కానీ, ఇస్లామిక్ దేశమైనప్పటికీ మైనార్టీకి రక్షణ కల్పిస్తామని ప్రకటించుకున్న పాకిస్తాన్​లో మాత్రం మైనార్టీల జనాభా రోజురోజుకూ తగ్గుతోందన్నారు. అక్కడి పరిస్థితులు దిగజారుతున్నాయని విమర్శించారు. అమెరికా వాషింగ్టన్ లోని పీటర్సన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్(పీఐఐఈ)​లో జరిగిన చర్చా వేదికలో నిర్మల ప్రసంగించారు. ఇండియాలో ముస్లింలపై హింస జరుగుతోందన్న ఫారిన్ మీడియా ప్రచారాలను ఆమె తోసిపుచ్చారు. నిజానిజాలు తెలుసుకోకుండా ప్రచారం చేయొద్దన్నారు.