రేపు (మే5) తెలంగాణలో నితిన్ గడ్కరీ పర్యటన

రేపు (మే5) తెలంగాణలో నితిన్ గడ్కరీ పర్యటన

హైదరాబాద్: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రేపు ( మే 5) తెలంగాణలో పర్యటించనున్నారు. కాగజ్ నగర్, హైదరాబాద్ లలో జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. సోమవారం ఉదయం 9గంటలకు నాగ్ పూర్ ఎయిర్ పోర్టునుంచి హెలికాప్టర్ లో బయలదేరి ఉదయం 10.15లకు సిర్పూర్ కాగజ్ నగర్ కు చేరుకోనున్నారు. 

కాగజ్నగర్లో ఉదయం10.30 జాతీయ రహదారుల ప్రారంభోత్సవం చేయనున్నారు. ఉదయం11.45 కు కాగజ్ నగర్ నుంచి కన్హా శాంతివనం సందర్శిస్తారు. 
అనంతరం అదే రోజు సాయంత్రం 4గంటలకు హైదరాబాద్ లోని బీహెచ్ ఈఎల్ ఫ్లై ఓవర్ ను  ప్రారంభించనున్నారు. సాయంత్రం 5గంటలకు అంబర్ పేట్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించనున్నారు. తర్వాత సాయంత్రం 6 గంటలకు అంబర్పేట్ గ్రౌండ్లో సభలో పాల్గొననున్నారు. రాత్రి 7 గంటలకు తిరిగి బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు.