ఉక్రెయిన్ నుంచి ఇండియాకు మరో 434 మంది

ఉక్రెయిన్ నుంచి ఇండియాకు మరో 434 మంది

ఉక్రెయిన్‌లో భీకర యుద్ధం జరుగుతుండడంతో అక్కడ చిక్కుకున్న భారత పౌరులు, విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం వేగంగా స్వదేశానికి తీసుకొస్తోంది. ‘ఆపరేషన్ గంగ’ పేరుతో ఈ తరలింపును యుద్ధ ప్రాతిపదికన చేపడుతోంది. ఇప్పటికే ఏడు ఫ్లైట్లలో 1,578 మంది భారతీయులను ఇండియాకు తీసుకురాగా.. ఇవాళ మధ్యాహ్నం మరో రెండు ఫ్లైట్స్ ఢిల్లీ చేరుకున్నాయి. ఈ రెండు విమానాల్లో ఒక దానిలో 216 మంది, మరో దానిలో 218 మంది చొప్పున సేఫ్‌గా ఇండియాకు వచ్చేశారు. వీరి రాకతో ఇప్పటి వరకు భారత్ చేరుకున్న వారి సంఖ్య 2,012కు చేరుకుంది.

స్వాగతం చెప్పిన కేంద్ర మంత్రులు ఆర్కే సింగ్, మన్‌సుఖ్

ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా కమర్షియల్ ఫ్లైట్స్‌కు ఎయిర్ స్పేస్‌ను మూసేయడంతో ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులను సరిహద్దు దేశాలైన హంగేరి, రొమేనియాలకు తరలించి స్పెషల్ ఫ్లైట్స్‌తో తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం రొమేనియా రాజధాని బురాకెస్ట్ నుంచి 182 మంది విద్యార్థులతో ఒక ఫ్లైట్ ముంబై చేరుకోగా.. కేంద్ర మంత్రి నారాయణ్ రాణే.. వారిని రిసీవ్ చేసుకున్నారు.

మధ్యాహ్నం హంగేరిలోని బుడాపెస్ట్ నుంచి 216 మందిని, రొమేనియాలోని బుకారెస్ట్ నుంచి 218 మందిని రెండు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి తీసుకురాగా.. వారికి కేంద్రమంత్రులు ఆర్కేసింగ్, మన్‌సుఖ్ మాండవీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ప్రతి భారతీయుడిని సేఫ్‌గా స్వస్థలాలకు చేరుస్తామని అన్నారు. ఈ తరలింపు ఆపరేషన్లను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా నలుగురు కేంద్ర మంత్రులను ప్రధాని మోడీ.. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లాలని ఆదేశించారని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్ డేట్స్

భోళా శంకరుడి ఫొటో గ్యాలరీ

వచ్చే నెల ఒకటి నుంచి కరెంట్ చార్జీల పెంపు