యోగా ఉత్సవ్ ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రులు 

యోగా ఉత్సవ్ ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రులు 

హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో ఈ నెల 27న నిర్వహించనున్న యోగ ఉత్సవ్ ఏర్పాట్లను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,  సర్వానంద సోనావాల పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఆయూష్ షిప్పింగ్ మంత్రి సర్వానంద సోనావాల రేపటి యోగా కార్యక్రమం లో పాల్గొంటారని  తెలిపారు. పెద్ద ఎత్తున నగర ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. మానవ సమాజం ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించేందుకు యోగా ఉపయోగ పడుతుందన్నారు. జూన్ 21న ఢిల్లీలో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరవుతారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 200 దేశాలు అంతర్జాతీయ యోగా డే ను జరుపుకుంటున్నాయన్న ఆయన... దేశంలో మొత్తం 75 ప్రాంతాల్లో యోగా డేని నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
 

మరిన్ని వార్తల కోసం...

కేంద్రంలో మార్పు తథ్యం

ఐదు పదుల వయసులో ‘ఖుష్బూ’ కొత్త లుక్