కేంద్రంలో మార్పు తథ్యం

కేంద్రంలో మార్పు తథ్యం

బెంగళూరు: రెండు మూడు నెలల్లో సంచలన వార్త వింటారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామి గౌడతో ఆయన భేటీ ఆయ్యారు. అనంతరం కుమారస్వామి గౌడ్ తో కలిసి సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ...  కేంద్రంలో మార్పు తథ్యమన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా... దేశంలో కరెంట్, నీటి సమస్య పోలేదన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ప్రజల పరిస్థితి మాత్రం మారలేదన్నారు. రైతులు, దళితులు, ఆదివాసీలు.... ఇలా ఎవరూ దేశంలో సంతోషంగా లేరని అన్నారు. 

దేశ పరిస్థితి రోజురోజుకీ దిగ‌జారిపోతోంద‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. భార‌త్ కంటే త‌క్కువ జీడీపీ ఉన్న చైనా ఇప్పుడు ఆర్థికంగా ప్ర‌పంచాన్ని శాసిస్తోంద‌న్నారు. మోదీ ప్ర‌భుత్వం మాత్రం 5 ట్రిలియ‌న్ డాల‌ర్ల బిజినెస్ అంటూ ప్ర‌చారం చేస్తోంద‌ని, ఇది దేశానికే అవ‌మాన‌మ‌ని అన్నారు. నిజంగా మ‌న‌సు పెట్టి అభివృద్ధి చేస్తే.. అమెరికా కంటే ఆర్థికంగా మ‌న‌మే ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంటామ‌ని కేసీఆర్ తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా ? బీజేపీ ప్రభుత్వం వస్తుందా లేక ఇంకో ప్రభుత్వం వస్తుందా ? అనేది సమస్య కాదని... ఉజ్వల భారతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. 

మరిన్ని వార్తల కోసం...

మహిళా ఎంపీపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

డెఫ్ ఒలింపిక్స్‌లో తెలుగమ్మాయికి కాంస్యం