తెలంగాణ విద్యుత్ బకాయిలను వసూలు చేస్తం : మంత్రి ఆర్కే సింగ్

తెలంగాణ విద్యుత్ బకాయిలను వసూలు చేస్తం : మంత్రి ఆర్కే సింగ్
  •     రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి ఆన్సర్​

న్యూఢిల్లీ, వెలుగు : ఏపీ సర్కార్​కు చెల్లించాల్సిన రూ.6 వేల కోట్లకు పైగా విద్యుత్ బకాయిలను తెలంగాణ నుంచి వసూలు చేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ వెల్లడించారు. కేంద్ర న్యాయ, ఆర్థిక శాఖలతో సంప్రదింపులు చేశాక ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మంగళవారం రాజ్యసభలో క్వశ్చన్ అవర్​లో ఏపీకి చెందిన వైఎస్సార్ సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ఈ బకాయిల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువచ్చారు.

రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణకు.. ఏపీ విద్యుత్ సరఫరా చేసిందన్నారు. దీంతో రూ.6 వేల కోట్లకు పైగా తెలంగాణ ప్రభుత్వం ఏపీకి బకాయిపడిందని సభకు తెలిపారు. కానీ, బకాయిలు చెల్లించ కుండా తెలంగాణ ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. దీనిపై కేంద్ర మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు.