
- రేపు పానిపట్లో లాంచ్ చేయనున్న
- కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి
హైదరాబాద్, వెలుగు: కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) కొత్త స్కీమ్ ఆడీటీ (అసిస్టెన్స్ ఇన్ డిప్లాయింగ్ ఎనర్జీ ఎఫిషియెంట్ టెక్నాలజీస్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్)ని ప్రారంభించనుంది. పానిపట్లో జులై15న కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఈ స్కీమ్ ను లాంచ్ చేయనున్నారు.
బీఈఈ మీడియా సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి ఈ పథకం ప్రాముఖ్యతను వెల్లడించారు. దేశ ఎంఎస్ఎంఈ కార్యకలాపాలలో ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి ఆడీటీ పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఉపాధి అవకాశాలను సృష్టించడం, ఇంధన మార్పిడిని వేగవంతం చేయడం ఈ స్కీమ్ లక్ష్యాలని ఆయన చెప్పారు.
తెలంగాణ పైలట్ ప్రాజెక్టుకు బీఈఈ ప్రశంసలు
ప్రధాన ఎంఎస్‌ఎంఈ క్లస్టర్‌లలోని ఔషధ పరిశ్రమలలో డీకార్బనైజేషన్ , ఇంధన సామర్థ్య పైలట్ ప్రాజెక్టులను విజయవంతంగా అమలు చేసినందుకు తెలంగాణ రెడ్కోను బీఈఈ ప్రశంసించింది. ఈ ప్రయత్నాలు గణనీయమైన ఇంధనం, ఖర్చును చేసి తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచాయి.