పేషెంట్లను అనవసరంగా రిఫర్ చేస్తే ఊరుకోం : మంత్రి దామోదర రాజనర్సింహ

పేషెంట్లను అనవసరంగా రిఫర్ చేస్తే ఊరుకోం : మంత్రి దామోదర రాజనర్సింహ
  • .జిల్లా, ఏరియా, సీహెచ్సీ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సేవలు మెరుగుపడాలి : మంత్రి దామోదర్
  • వారానికి ఒకసారి హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆకస్మిక తనిఖీ చేయాలి
  • డీసీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు వైద్యశాఖ మంత్రి ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా రోగులను పైస్థాయి హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిఫర్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో సెకండరీ హెల్త్ కేర్ పరిధిలోని హాస్పిటల్స్ పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా, జిల్లా హాస్పిటల్స్ మేజర్ సర్జరీలు చేసే స్థాయికి ఎదగాలని, టీచింగ్ హాస్పిటళ్లతో సమానంగా వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే జిల్లా, ఏరియా హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1,616 మంది స్పెషలిస్ట్ డాక్టర్లను రిక్రూట్ చేశామని, అవసరమైన చోట కొత్త సీటీ స్కాన్లు, ఇతర డయాగ్నస్టిక్ పరికరాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎమర్జెన్సీలో రిఫర్ చేయాల్సి వస్తే, సంబంధిత హాస్పిటల్ డాక్టర్లతో ముందే సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.

డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పుదు

జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీసీహెచ్ఎస్)లు ఆఫీసులకే పరిమితం కాకుండా, వారానికి ఒకరోజు తమ పరిధిలోని హాస్సిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆకస్మిక తనిఖీ చేయాలని మంత్రి ఆదేశించారు. డాక్టర్ల హాజరు, మందుల నిల్వలు, పారిశుధ్యం, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతి నెలా వర్క్ రిపోర్ట్ సమర్పించాలని సూచించారు. విధులకు గైర్హాజరైనా, సమయం కంటే ముందే వెళ్లిపోయినా సిబ్బందిపై రూల్స్​ ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వంటి చిన్న సమస్యలను పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని, రోగుల సంఖ్యను మేరకు వైద్య పరికరాల కోసం స్పష్టమైన జస్టిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రతిపాదనలు పంపాలని మంత్రి పేర్కొన్నారు. హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, అన్ని జిల్లాల డీసీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లు పాల్గొన్నారు.