హైదరాబాద్ సిటీ లోపలి పరిశ్రమలు ..ఓఆర్‌‌‌‌‌‌‌‌ఆర్ అవతలికి తరలింపు

హైదరాబాద్ సిటీ లోపలి పరిశ్రమలు ..ఓఆర్‌‌‌‌‌‌‌‌ఆర్ అవతలికి తరలింపు

 

  • ఆ భూములు రెసిడెన్షియల్, విద్యాసంస్థలు, వాణిజ్య అవసరాలకు వాడుకునేలా అవకాశం 
  • హెచ్ఐఎల్‌‌‌‌టీ పాలసీని విడుదల చేసిన ప్రభుత్వం 
  • కేటగిరీల వారీగా 30%, 50% ఇంపాక్ట్ ఫీజు ఖరారు
  • అప్లికేషన్ ​పెట్టుకున్న రెండు వారాల్లో అనుమతులు.. 45 రోజుల్లో కన్వర్షన్ 

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్ సిటీ లోపల ఉన్న కాలుష్యకారక, ఔట్​డేటెడ్​టెక్నాలజీతో నడుస్తున్న పరిశ్రమలను ఔటర్​రింగ్​రోడ్​(ఓఆర్ఆర్) అవతలకు తరలించేందుకు సర్కారు కసరత్తు ప్రారంభించింది. బాలానగర్, కాటేదాన్, కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, ఉప్పల్, జీడిమెట్ల, చర్లపల్లి తదితర 22 ఇండస్ట్రియల్​ఏరియాల్లోని భూములను ఇతర అవసరాలకు వాడుకునేలా కొత్త పాలసీ తీసుకొచ్చింది. ఇందుకోసం హైదరాబాద్​ఇండస్ట్రియల్ ల్యాండ్స్​ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్​పాలసీ (హెచ్ఐఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీపీ)ని అమలు చేయనుంది. ఈ మేరకు శనివారం ఇండస్ట్రీస్, కామర్స్​డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్​ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 22 ఇండస్ట్రియల్ ఏరియాల్లోని 9,292.53 ఎకరాల భూములను ఇతర అవసరాలకు వాడుకునేందుకు మార్చుకునేలా అవకాశం కల్పించింది. ఈ మొత్తం భూముల్లో నిర్మాణాలు చేపట్టినవి (ప్లాటెడ్) 4,740.14 ఎకరాలు అని పేర్కొంది. 

అందుకే తరలింపు.. 

సిటీలో 60 ఏండ్ల కిందట పరిశ్రమల కోసం భూములను కేటాయించారు. ఈ ఆరు దశాబ్దాల కాలంలో సిటీ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఒకప్పుడు సిటీ అవతల అనుకున్న ప్రాంతాలు కాస్తా.. ఇప్పుడు సిటీ కోర్​ఏరియాలుగా మారిపోయాయి. అంతేగాకుండా అప్పుడు ఏర్పాటు చేసిన పరిశ్రమలు ప్రస్తుతం కాలుష్యకారకాలుగా మారడం.. తో ఆర్థిక భారంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గతంలోనే ఇలాంటి పరిశ్రమలన్నింటినీ ఓఆర్ఆర్​ అవతలికి తరలిస్తామని ప్రకటించింది. ఆ భూములను వేరే రకంగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించింది. ఆ ఇండస్ట్రియల్ భూముల్లో అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్, ఇంటిగ్రేటెడ్​టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను నిర్మించి రెసిడెన్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వాడుకోవడం.. ఆఫీసులు, రిటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్లు, హోటళ్ల వం టి కమర్షియల్ కాంప్లెక్సుల నిర్మాణం.. స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటళ్లు, రీసెర్చ్ సెంటర్ల వంటి విద్యా సంస్థల ఏర్పాటు.. పార్కులు, స్పోర్ట్స్​కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, కల్చరల్​సెంటర్ల వంటి రీక్రియేషనల్ వసతుల ఏర్పాటు.. టెక్నాలజీ పార్కుల నిర్మాణం వంటి వాటి ని అభివృద్ధి చేస్తామని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.  

కన్వర్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ​ఫీజు..

పరిశ్రమల భూముల యజమానులు.. వాటిని ఫ్రీహోల్డ్​స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి కన్వర్షన్ చేసుకునేందుకు ప్రభుత్వానికి డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్​ఇంపాక్ట్​ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. 80 ఫీట్ల కన్నా తక్కువ రోడ్లున్న ప్లాట్లకు సబ్​రిజిస్ట్రార్​ఆఫీసు (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో) విలువపై 30 శాతం ఇంపాక్ట్​ఫీజును నిర్ణయించింది. ఈ కేటగిరీ కింద 54.24 శాతం భూములు ఉండగా.. ప్లాట్లుగా అభివృద్ధి చేసిన 84.24 శాతం యూనిట్లు ఉన్నాయని పేర్కొంది. 80 ఫీట్ల కన్నా పెద్ద రోడ్లున్న ప్లాట్ల కన్వర్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో విలువపై 50 శాతంగా ఇంపాక్ట్​ఫీజును నిర్ధారించింది. ఈ కేటగిరీలో 45.76 శాతం భూములు ఉండగా, ప్లాట్లుగా డెవలప్​అయిన యూనిట్లు 17.76 శాతం ఉన్నట్టుగా పేర్కొంది. చేంజ్​ఆఫ్​ల్యాండ్​యూజ్​(సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ), హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీపీ అమలుకు నోడల్​ఏజెన్సీగా తెలంగాణ ఇండస్ట్రియల్​ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్​కార్పొరేషన్​ (టీజీఐఐసీ) ఉంటుందని పరిశ్రమల శాఖ జీవోలో వెల్లడించింది. ఆయా భూములను ఇతర అవసరాలకు మార్చుకునేందుకు ఇష్టపడే సంస్థలు.. టీజీఐపాస్​ ద్వారానే పారదర్శకంగా దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొంది. అప్లికేషన్​ సమయంలోనే ఇంపాక్ట్​ ఫీజులో 20 శాతం చెల్లించాలనే నిబంధన పెట్టింది. ఈ పాలసీ అమల్లోకి వచ్చిన రోజు నుంచి ఆరు నెలల్లోపు సంస్థలు దరఖాస్తులను పెట్టుకోవాల్సి ఉంటుంది.  

దరఖాస్తుల ఆమోదానికి కమిటీ..

ఇండస్ట్రీలు పెట్టుకున్న దరఖాస్తులను ఆమోదించేందుకు ఇండస్ట్రీస్​శాఖ స్పెషల్​చీఫ్​సెక్రటరీ నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. టీజీఐఐసీ వైస్​చైర్మన్, ఎండీ, ఇండస్ట్రీస్​డైరెక్టర్, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ మెట్రోపాలిటన్​కమిషనర్లు ఈ కమిటీలో కన్వీనర్లుగా ఉంటారు. చేంజ్​ఆఫ్ ల్యాండ్​యూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఏదైనా కంపెనీ దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లోపు టీజీఐఐసీ ఆ దరఖాస్తును పరిశీలించాల్సి ఉంటుందని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. అనంతరం వారం రోజుల్లోగా పాలసీ అమలుకు ఏర్పాటు చేసిన కమిటీ.. ఆ దరఖాస్తును ఆమోదిస్తుందని తెలిపింది. ఆమోదం తెలిపిన వారంలోపు సదరు కంపెనీకి డిమాండ్​ నోటీసును అందిస్తారు. నోటీసులు అందుకున్న తర్వాత ఆ కంపెనీ.. మిగతా 80 శాతం ఇంపాక్ట్​ఫీజును రెండు విడతల్లో 45 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కంపెనీ అనుకున్న సమయంలోగా ఫీజును చెల్లించకపోయినా.. డీఫాల్ట్​కు పాల్పడినా ఒక నెల గ్రేస్​ పీరియడ్​ఇచ్చి.. ప్రతి విడతలో చేసే పేమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఒక్క శాతం పెనాల్టీని విధిస్తారు. ఒక నెల తర్వాత సదరు సంస్థను ఎలాంటి రీఫండ్​లేకుండానే డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్వాలిఫై చేస్తారు.  

ప్లాటెడ్ ​భూముల విలువ 22 వేల కోట్లు.. 

స్టాండ్ ​అలోన్ ​భూములు (ఇండస్ట్రియల్ ​పార్కుల్లో కాకుండా ఓఆర్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లోపల వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఇండిపెండెంట్ ​పరిశ్రమల భూములు) 2వేల ఎకరాలను మినహాయించగా.. మిగతా 7,292.53 ఎకరాల భూమికి ఎస్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో రేట్ల ఆధారంగా వాటి విలువ రూ.35,066 కోట్లుగా ఉంది. ప్లాటింగ్ చేసిన 4,740.14 ఎకరాల భూముల విలువ రూ.22,660.12 కోట్లుగా ఉన్నది. అయితే  9,292 ఎకరాల్లో 2వేల ఎకరాలు స్టాండ్​అలోన్​ భూములుగా పేర్కొన్న ప్రభుత్వం.. వాటి విలువను మాత్రం తెలియజేయలేదు. హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఎల్​టీపీ పాలసీలో భాగంగా ఈ భూములనూ చేంజ్​ఆఫ్ ల్యాండ్​యూజ్​కిందకు తీసుకొస్తున్నట్టు జీవోలో ప్రభుత్వం వెల్లడించింది. కాగా, ఎస్ఆర్​వో విలువ ఆధారంగా అత్యధికంగా సనత్​నగర్​ఇండస్ట్రియల్​పార్కులో చదరపు మీటరు భూమి ధర రూ.43,500గా ప్రభుత్వం నిర్ధారించింది. అత్యల్పంగా చందూలాల్​బారాదరి, ఐడీఏ పాశమైలారంలో చదరపు మీటరుకు రూ.3,100గా నిర్ణయించింది. కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో రూ.26,700, బాలానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.23,000, నాచారంలో రూ.21 వేలు, మౌలాలిలో రూ.20,300గా నిర్ణయించింది. మిగతా ఇండస్ట్రియల్​ పార్కుల్లో చదరపు మీటరు భూమి ధర రూ.7 వేల నుంచి రూ.18,900 మధ్యలో ఉన్నది.