‘కర్తార్‌పూర్’ తర్వాత తెరవాల్సింది ఆ తలుపులే..

‘కర్తార్‌పూర్’ తర్వాత తెరవాల్సింది ఆ తలుపులే..

కర్తార్‌పూర్ కారిడార్ తరువాత ఇప్పుడు ఈ దేశ ప్రజల కోసం నంకనా సాహిబ్ తలుపులు తెరవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభానికి మద్ధతిచ్చిన ప్రజలకు మరియు ఈ విషయంపై ప్రోత్సహించిన ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన కృతజ్జత తెలిపారు. గురునానక్ దేవ్ 550వ జయంతిని పురస్కరించుకుని ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. నంకనా సాహిబ్‌ను కూడా సందర్శించగలిగే రోజు చాలా దూరంలో లేదని ఆయన అన్నారు.

పాకిస్థా‌న్లోని పంజాబ్ ప్రావిన్స్‌లో నంకనా సాహిబ్ ఒక నగరం. ఇది లాహోర్‌కు పశ్చిమాన 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. గురునానక్ ఈ నగరంలోనే మొదటగా బోధించడం ప్రారంభించాడు. అందుకే ఈ నగరానికి గురునానక్ పేరు మీదుగా నంకనా సాహిబ్ అని పేరు పెట్టారు. నంకనా సాహిబ్ చారిత్రాత్మక మరియు ఎన్నో మత విలువలు కలిగిన నగరమని ఆయన అన్నారు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే సిక్కులకు ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రమని ఆయన అన్నారు. అందుకే కర్తార్ పూర్ తర్వాత సిక్కుల కోసం నంకనా సాహిబ్ తలుపులు తెరవాలని ఆయన అన్నారు.

గురునానక్ బోధనలు అనేక దేశాలలో వ్యాప్తిచెందాయన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. గురునానక్ సిక్కుల విశ్వాసానికి పునాది వేశాడని.. అందుకే అతను ఎల్లప్పుడూ గౌరవించబడతాడని ఆయన అన్నారు. కుల, వర్గ, హోదాతో సంబంధం లేకుండా ‘అందరికీ ఆహారం’ (లంగర్) అందించే గురుద్వారాల నుండి ఎవరూ ఆకలితో వెనక్కి వెళ్లరని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. సిక్కుల మందిరాలు త్వరలోనే పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు.

మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ను ఫాలో అవ్వండి