ప్రియాంక ‘క్రిమినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ కామెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై యూపీ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ప్రియాంక ‘క్రిమినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ కామెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై యూపీ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

క్రైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేటు తగ్గిందని వివరణ

ఉత్తర ప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్రిమినల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రీగా తిరుగుతున్నా ఉత్తర ప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టించుకోవడంలేదంటూ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయకురాలు ప్రియాంక గాంధీ శనివారం చేసిన ట్వీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వివాదమవుతోంది.  దీనిపై యూపీ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది. ‘‘ ఉత్తర ప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్రిమినల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రీగా తిరుగుతున్నారు. వాళ్లకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది.  రోజురోజుకు క్రైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఇన్సిడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  పెరిగిపోతున్నాయి.   అయినా బీజేపీ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రం వీటిని పట్టించుకోవడంలేదు. క్రిమినల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముందు యూపీ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోకరిల్లుతోంది’’ అంటూ యోగి ఆదిత్యనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వంపై  ప్రియాంక  ట్వీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆరోపణలను సమర్థిస్తూ  రాష్ట్రంలో ఈమధ్య జరిగిన క్రైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై పేపర్లలో వచ్చిన హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆమె టాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ట్విటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఆమె చేసిన  ఆరోపణల్ని  పోలీసులు వెంటనే ఆ ఖండించారు.  రాష్ట్రంలో క్రైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేటు బాగా తగ్గిందని వివరణ ఇచ్చారు.

బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో క్రిమినల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిందని  లా మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రిజేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాఠక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌   చెప్పారు.   వ్యక్తిగత శత్రుత్వాల వల్లే క్రైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంఘటనలు రికార్డవుతున్నాయని అన్నారు.  క్రైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసు నమోదైన వెంటనే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని మంత్రి  చెప్పారు. సమాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాదీ పార్టీ కూడా ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  విమర్శలు గుప్పించింది.  యోగి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వంలో క్రైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేటు విపరీతంగా పెరిగిపోతోందని ఆరోపించింది.  ఉన్నావో జైల్లో ఇద్దరు ఖైదీలు ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానే పిస్టల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రదర్శించిన వీడియో వైరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతున్ననేపథ్యంలో ఎస్పీ ఈ ఆరోపణల్ని చేసింది. ఈ సంఘటన ముఖ్యమంత్రికి ‘‘ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛాలెంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’’ అని ఎస్పీ  కామెంట్ చేసింది