రెంట్ పే చేయలేదని దంపతుల్ని కాల్చి చంపిన ఇంటి ఓనర్

రెంట్ పే చేయలేదని దంపతుల్ని కాల్చి చంపిన ఇంటి ఓనర్

రెంట్ చేయలేదన్న అకారణంగా ఓనర్ తన ఇంట్లో అద్దెకు ఉంటున్న భార్య భర్తల్ని తుపాకీతో కాల్చి చంపాడు. లాక్ డౌన్ కారణంగా అద్దె వసూళ్ల విషయంలో ఎవర్ని బలవంత పెట్టవద్దని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాయి.  అయినా కొంతమంది ఇంటి ఓనర్లు బలవంతంగా వసూల్ చేస్తున్నారు. ఇవ్వకపోతే బెదిరిస్తున్నారు. కాల్చిచంపుతున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ లో అజమ్ ఘర్ జిల్లాకు చెందిన సంజీవ్ కోత్వాలీ లో అనే నగరంలో ఆటో స్పేర్ పార్ట్స్ బిజినెస్ చేస్తున్నాడు. స్థానికంగా ఉన్న రాకేష్ రాయ్ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. అయితే లాక్ డౌన్ కారణంగా షాపు ఓపెన్ చేయకపోవడం, కుటుంబ పోషణ కష్టంగా మారింది. దీంతో రెంట్ పే చేయలేదు. అయితే ఇంటి ఓనర్ బాధితుణ్ణి పలు మార్లు రెంట్ కట్టాలని హుకుం జారీ చేశాడు. లాక్ డౌన్ వల్ల ఆర్ధిక సమస్యలు తలెత్తాయని, రెంట్ తరువాత పే చేస్తానని సంజీవ్ ఇంటి ఓనర్ రాకేష్ కు చెప్పాడు. మరుసటి రోజు  ఇంటి ఓనర్ రాకేష్  దగ్గరకు వచ్చి రెంట్ పే చేయాలని వాగ్వాదానికి దిగాడు. రెంట్ లేవని, కొంత సమయం కావాలని కోరాడు. దీంతో విచక్షణ కోల్పోయిన ఇంటి ఓనర్ సంజీవ్ అతని భార్యపై  తుపాకీతో కాల్పులు జరిపాడు.  కాల్పులు శబ్ధంతో ఉలిక్కిపడ్డ స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. రక్తపు మడుగులో ఉన్న బాధితుల్ని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. కాగా స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాల్పుల అనంతరం పరారైన ఇంటి ఓనర్ రాకేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.