టీచర్ అంటే పిల్లలకు రోల్ మోడల్.. చదువుతోపాటు సంస్కారం నేర్పిస్తారు.. టీచర్ అంటే జీవితాన్ని తీర్చిదిద్దే పాత్ర పోషిస్తారు. తల్లితండ్రి తర్వాత గురుదేవోభవా అంటారు.. ఈ టీచర్ మాత్రం వెరీ వెరీ డిఫరెంట్.. ఈ సామెతలు అన్నీ పాత చింతకాయ పచ్చడి అన్నట్లు వ్యవహరిస్తుంది. చదువు చెప్పటం వచ్చో రాదో కానీ.. ఈ టీచర్ డాన్స్ మాత్రం ఇరగదీస్తుంది. అది ఆమె ఇంట్రస్ట్.. ఆమె హాబీ అనుకుంటే పర్వాలేదు.. కాకపోతే ఇక్కడే ఆమె వ్యవహారం రచ్చకెక్కింది.. తన డాన్స్ ప్రావీణ్యంతో తీసిన రీల్స్, షార్ట్స్ ను స్కూల్ లోని పిల్లలకు పంపిస్తూ.. లైక్ చేయండి.. షేర్ చేయండి అంటూ రోజు సతాయిస్తుందంట.. డాన్స్ ఎలా ఉందో కామెంట్ చేయాలంటూ పిల్లలను బెదిరిస్తుందంట.. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కింది.. పూర్తి వివరాల్లోకి వెళితే...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్ షహర్ జిల్లా లషికార్ పూర్ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ప్రభా నేగి అనే మహిళ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఈమెకు రీల్స్ చేయడం అంటే పిచ్చి. ఇంట్లో..బయట ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తూ..సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుంటుంది. అయితే ఇంట్లో కానీ..బయట ప్రాంతాల్లో రీల్స్ చేయడం ఆమె వ్యక్తిగతం...కానీ ఈ ప్రభా నేగి టీచర్..స్కూల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పడం మానేసి రీల్స్ చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
Also Read :- ఎర్ర బెండకాయలు.. పండిస్తే లాభం.. తింటే ఆరోగ్యం..
ప్రభానేగి స్కూళ్లో హిందీ పాటలు, కామెడీ డైలాగులను అనుకరిస్తూ రీల్స్ చేస్తోంది. విద్యా్ర్థులు ఫోన్ పట్టుకుంటే..హిందీ పాటలు, డైలాగును అనుకరిస్తూ రీల్స్ చేసేది. రీల్స్ చేయడంతో పాటు..వీటిని విద్యార్థులకు పంపేది. తాను చేసే రీల్స్ ను లైక్ చేయాలని..షేర్ చేయాలని ఆదేశించేది. లేకపోతే విద్యార్థులను బెదిరించేది. దీంతో చేసేదేమి లేక..విద్యార్థులు టీచర్ ప్రభానేగి చేసిన రీల్స్ ను లైక్, షేర్ చేసేవాళ్లు. అయితే విద్యార్థుల చేత షేర్ చేయించడం ప్రభా నేగి కొంప ముంచింది. ప్రభా నేగి చేసిన రీల్స్..విద్యా శాఖ ఉన్నతాధికారుల కంట పడ్డాయి. దీనికి తోడు..స్కూళ్ల పాఠశాల చెప్పకుండా రీల్స్ చేస్తోందంటూ సహచర ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రభా నేగిని సస్పెండ్ చేశారు.
बुलन्दशहर में विधायलय में रील बनाने वाली शिक्षिका प्रभा नेगी का वीडियो सोशल मीडिया वायरल।
— anubhav sharma (@anubhav57502441) September 14, 2023
क्लास रूम में बनाई रील्स हो रही हैं सोशल मीडिया पर वायरल।
शिकारपुर के गांव रिवाड़ा उच्च प्राथमिक विद्यालय में तैनात है शिक्षिका।
शिक्षिका को बीएसए ने किया निलंबित। @UPGovt
@ pic.twitter.com/dFjeqqr0bG
ప్రభా నేగి రీల్స్ పై తమకు ఫిర్యాదు అందాయని ప్రాథమిక విద్యాధికారి లక్ష్మీకాంత్ పాండే తెలిపారు. ప్రభా నేగి రీల్స్ పై నివేదిక కూడా అందిందని..ఇద్దరు వ్యక్తులతో కమిటీ వేసి విచారణ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఆమెను సస్పెండ్ చేశామని..దోషిగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

